జాతీయ వార్తలు

ప్రజ్ఞాసింగ్‌కు క్లీన్ చిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 13: మాలెగావ్ పేలుళ్లకేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) క్లీన్‌చిట్ ఇచ్చింది. మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టం(మోకా) కింద ఆమెపై విచారణ జరుగుతోంది. ఈ కేసులో సాధ్వి ప్రజ్ఞాసింగ్ సహా మిగతా నిందితులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద చర్య తీసుకునే అవకాశం ఉన్నా, మోకా చట్టం కింద చర్య తీసుకోవడానికి అవకాశం లేదని పేర్కొంటూ ఎన్‌ఐఏ శుక్రవారం స్థానిక ప్రత్యేక కోర్టులో తాజా చార్జిషీట్ దాఖలు చేసింది. అంతేకాదు దర్యాప్తు సమయంలో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, మరో అయిదుగురిపై తగినన్ని సాక్ష్యాధారాలు లభించలేదని కూడా ఎన్‌ఐఏ తన తాజా చార్జిషీట్‌లో పేర్కొనడం గమనార్హం. వారిపై ప్రాసిక్యూషన్ కొనసాగించలేమని సంస్థ తన తాజా చార్జిషీట్‌లో తెలియజేసింది. 2008 సెప్టెంబర్ 29న మహారాష్టల్రోని మాలెగావ్‌లోజరిగిన పేలుళ్లలో 8 మంది మృతి చెందగా, 89 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. మొట్టమొదటిసారి మితవాద హిందూ తీవ్రవాదుల హస్తం ఉన్న కేసుగా ఇది గుర్తింపు పొందింది. కాగా, 2011లో ఎన్‌ఐఏ ఈ కేసు దర్యాప్తు చేపట్టడానికి ముందు ఎటిఎస్ సాధ్వి ప్రజ్ఞాసింగ్, ఆర్మీ లెఫ్టెనెంట్ కల్నల్ పురోహిత్ సహా 16 మందిపై కేసు నమోదు చేసినప్పటికీ 14 మందిపై మాత్రమే ముంబ యి కోర్టులో 2009 జనవరి 20న, తిరిగి 2011 ఏప్రిల్ 21న రెండు చార్జిషీట్లు దాఖలు చేసింది. కాగా, ఎటిఎస్ దాఖలు చేసిన చార్జిషీట్లను, మోకా చట్టాన్ని తమకు వర్తింపజేయడాన్ని సవాలు చేస్తూ సాధ్వి ప్రజ్ఞాసింగ్, పురోహిత్‌లు బొంబాయి హైకోర్టు, సుప్రీంర్టులో గతంలో పలు పిటిషన్లు దాఖలు చేశారు. సాధ్వి ప్రజ్ఞతో పాటుగా ఎన్‌ఐఏ అభియోగాలను ఉపసంహరించుకున్న అయిదుగురు నిందితుల్లో శివనారాయణ్ , శ్యామ్ భవర్‌లాల్ సాహు, ప్రవీణ్, లోకేశ్ సింగ్, ధన్‌సింగ్ చౌదరి ఉన్నారు.
chitram...
ముంబయలో సెషన్స్ కోర్టుకు శుక్రవారం
మాలేగావ్ నిందితులను తరలిస్తున్న దృశ్యం