జాతీయ వార్తలు

ఏడు రాష్ట్రాలు ‘హోదా’ కోరుతున్నాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ప్రత్యేక హోదా కల్పించవలసిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్‌తోపాటు రాజస్థాన్, బీహార్, చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు అందాయని ప్రణాళిక వ్యవహారాల మంత్రి జితేందర్ సింగ్ వెల్లడించారు. వైకాపా సభ్యుడు వైఎస్ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా శుక్రవారం లోక్‌సభలో ఈ విషయం తెలిపారు. ప్రత్యేక పాకేజీ కింద ఆంధ్రప్రదేశ్‌కు 350కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు. ఈ మొత్తాన్ని రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలలోని వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ఖర్చుచేయవలసి ఉంటుంది. 2015-16కి మరో 350కోట్ల రూపాయలను ఈప్రాంతాల అభివృద్ధికి కేటాయించడం జరుగుతుందని ప్రకటించారు. ఒకొక్క జిల్లాకు 50 కోట్ల రూపాయలు లభిస్తాయని ఆయన చెప్పారు. కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా రాజ్‌భవన్, విధానసభల నిర్మాణానికి ఐదు వందల కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ విడుదల చేసిందని జితేందర్ సింగ్ పేర్కొన్నారు. దీంతోపాటు పట్టణాభివృద్ధి శాఖ వివిధ పథకాలను చేపట్టేందుకు వెయ్యికోట్ల రూపాయలను కేటాయించిందని ఆయన వివరించారు. విజయవాడలో400 కోట్ల రూపాయల ఖర్చుతో మురుగునీటి పారుదలకు ఒక పథకాన్ని అమలు చేస్తారు. గుంటూరులో 540 కోట్ల రూపాయలతో భూగర్భ నీటి పారుదల పథకాన్ని పట్టణాభివృద్ధి శాఖ మంజూరు చేసిన నిధులతో పూర్తవుతాయని సుబ్బారెడ్డికి తెలిపారు.