జాతీయ వార్తలు

ఉగ్రవాదంపై పోరును ప్రశ్నార్థకం చేసిన ఎన్‌ఐఏ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: మాలెగావ్ పేలుళ్ల కేసులో జాతీయ భద్రతా ఏజన్సీ (ఎన్‌ఐఏ) దాఖలు చేసిన తాజా అఫిడవిట్ ఉగ్రవాదంపై పోరుకు భారత్ కృతనిశ్చయాన్ని ప్రశ్నార్థకంగా మార్చివేసిందని కాంగ్రెస్ పార్టీ ఆదివారం వ్యాఖ్యానించింది. కాగా, ఈ కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షించాలని డిమాండ్ చేసింది. ఎన్‌ఐఏ ‘నమో ఇనె్వస్టింగ్ ఏజన్సీ’గా మారిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ ఇక్కడ విలేఖరుల సమావేశంలో అంటూ, దివంగత హేమంత్ కర్కరే నేతృత్వంలో ముంబయి ఎటిఎస్ పకడ్బందీగా నిర్వహించిన దర్యాప్తును నాశనం చేయడమే లక్ష్యంగా ఎన్‌ఐఏ చార్జిషీట్ ఉందని ఆరోపించారు. ఎటిఎస్ రికార్డు చేసిన స్టేట్‌మెంట్లు ఏవీ సాక్ష్యాలుగా స్వీకరించడానికి పనికిరాకుండా చేయడం కోసమే ఎన్‌ఐఏ నిందితులపై ‘మోకా’ అభియోగాలను ఉపసంహరించుకుందని ఆయన ఆరోపించారు. సాధ్వీ ప్రజ్ఞాసింగ్ సహా ఆరుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించడానికి, మిగతా నిందితులపై కేసును నీరుగార్చడానికి దారితీసిన ఎన్‌ఐఏ యుటర్న్‌పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. ఉగ్రవాదంపై పోరులో భారత దేశ నిజాయితీ, దాని కృతనిశ్చయంపై ఈ పరిణామాలు అనుమానాలను లేవనెత్తుతున్నాయని ఆయన అన్నారు. కర్కరే త్యాగానికి ఎన్‌ఐఏ అర్థం లేకుండా చేస్తోందని ఆయన అన్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమ సిద్ధాంతాలను పాటించేవారు లేదా తమ అనుబంధ సంస్థలకు చెందినవారు లేదా అభియోగాలను ఎదుర్కొంటున్న వారిని కాపాడడానికి ప్రభుత్వం నిరంతరంగా ప్రయత్నిస్తూనే ఉందని కూడా ఆయన ఆరోపించారు.