జాతీయ వార్తలు

సివిల్స్ టాపర్ మార్కులు 52 శాతమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: ఈ ఏడాది ప్రకటించిన సివిల్ సర్వీస్ పరీక్షలో టాప్ ర్యాంక్ పొందిన టిరా దబీకి 52 శాతం మార్కులే రావడాన్ని బట్టి దేశంలోని బ్యూరోక్రాట్లను ఎంపిక చేయడానికి యుపిఎస్‌ఇ ఎంతటి కఠినమైన ప్రమాణాలను పాటిస్తోందో అర్థమవుతుంది. ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్‌లాంటి ప్రభుత్వ సర్వీసుల్లో పదవులకోసం అర్హులను ఎంపిక చేయడానికి యుపిఎస్‌ఇ ప్రతి ఏటా మూడు దశల్లో -ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూలు- నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, 2015 సివిల్ సర్వీస్ పరీక్షలో టాపర్‌గా నిలిచిన ఢిల్లీ లేడీ శ్రీరామ్ కాలేజినుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన 22 ఏళ్ల టినాకు మొత్తం 2,025 మార్కులకుగాను 1,063 మార్కులు (52.49శాతం) వచ్చాయి. రెండో ర్యాంక్ సాధించిన జమ్మూ, కాశ్మీర్‌కు చెందిన ఆమిర్ ఉల్ షఫీ ఖాన్‌కు 1,018 మార్కులు (50.27 శాతం), మూడో ర్యాంక్ సాధించిన జస్మీత్ సింగ్ సంధుకు 1,014 (50.07) మార్కులు వచ్చాయి. కాగా, ఈ నెల 8న ప్రకటించిన సివిల్ సర్వీస్ పరీక్ష ఫలితాల ఆధారంగా వివిధ కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో నియామకం కోసం మొత్తం 1,078 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరిలో జనరల్ కేటగిరీకి చెందిన వారు 499 మంది ఉండగా, ఒబిసికి చెందిన వారు 314 మంది, ఎస్సీలకు చెందిన వారు 176 మంది, ఎస్టీలకు చెందిన వారు 89 మంది ఉన్నారు. మరో 172 మందిని వెయింటింగ్ లిస్టులో ఉంచారు. విజయం సాధించిన అభ్యర్థులతో పాటుగా విజయం సాధించని వారి మార్కుల జాబితాలను యుపిఎస్‌ఇ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. జూలై 13 దాకా వీటిని వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు.