జాతీయ వార్తలు

లక్ష్యాలను పునఃపరిశీలించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 15: గంగానది వెంట ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను వాటినుంచి ఏమాత్రం కాలుష్య జలాలు వెలువడకుండా (జీరో లిక్విడ్ డిశ్చార్జ్-జెడ్‌ఎల్‌డి) ఉండేలా మార్చేందుకు విధించిన గడువు ఆచరణ సాధ్యంకాని రీతిలో ఉందని పార్లమెంటరీ స్థారుూ సంఘం పేర్కొంది. రెండు కేంద్ర మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా వాటి లక్ష్యాలను పునఃపరిశీలించాలని, 2017 మార్చి నాటికి ఆ లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించింది. గంగానది వెంట ఉన్న డిస్టిలరీలు, వస్త్ర పరిశ్రమల నుంచి కాలుష్య జలాలు గంగానదిలో చేరకుండా ఉండేందుకు డిస్టిలరీలను 2016 సెప్టెంబర్ నాటికి, వస్త్ర పరిశ్రమలను 2016 డిసెంబర్ నాటికి జెడ్‌ఎల్‌డి యూనిట్లుగా మార్చాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖల మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని పార్లమెంటరీ అంచనాల కమిటీ పేర్కొంది. మరోవైపు, కేంద్ర జలవనరులు, నదుల అభివృద్ధి, గంగానది ప్రక్షాళన మంత్రిత్వ శాఖ ఇందుకోసం 2016 మార్చి, 2017 మార్చిలను గడువుగా విధించుకొందని కమిటీ వెల్లడించింది. కాలుష్య పూరితమైన వ్యర్థ జలాలను గంగానదిలోకి వదలుతున్న కలప గుజ్జు, కాగితపు పరిశ్రమలను 2017 మార్చిలోగా జెడ్‌ఎల్‌డి యూనిట్లుగా మార్చాలని రెండు మంత్రిత్వ శాఖలు లక్ష్యంగా పెట్టుకున్నాయని బిజెపి సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషి నేతృత్వంలోని అంచనాల కమిటీ పేర్కొంది. పెద్దఎత్తున కాలుష్య జలాలను వదలుతున్న పరిశ్రమలను జెడ్‌ఎల్‌డి యూనిట్లుగా మార్చడానికి రెండు మంత్రిత్వ శాఖలు ఆచరణ సాధ్యం కాని రీతిలో వేర్వేరు గడువులు పెట్టుకున్నాయని ఈ నెల 11న పార్లమెంటుకు సమర్పించిన తన నివేదికలో కమిటీ వివరించింది. అందువల్ల రెండు మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా తమ గడువులను తిరిగి పరిశీలించాలని, 2017 మార్చిలోగా లక్ష్యాలను పూర్తి చేయాలని అంచనాల కమిటీ సూచించింది. కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై భారీగా జరిమానాలు విధించడం కన్నా, తీవ్రస్థాయిలో కాలుష్యానికి కారణమవుతున్న చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా అవి కాలుష్య రహిత పరిశ్రమలుగా మారడానికి సహకరించాలని కూడా అంచనాల కమిటీ సూచించింది.