అంతర్జాతీయం

వరస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన బాగ్దాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగ్దాద్, మే 17: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో షియాలు అధిక సంఖ్యలో ఉండే నివాస ప్రాంతాల్లోని మార్కెట్లలో మంగళవారం సంభవించిన వరస బాంబు పేలుళ్లలో కనీసం 54 మంది చనిపోగా, దాదాపు వందమంది దాకా గాయపడ్డారు. మొదట ఆరుబయలు మార్కెట్‌కు చుట్టూ ఉన్న ప్రహరీ గోడకు వెలుపల ఒక బాంబు పేలింది. ఆ పేలుడులో గాయపడిన వారికి సాయపడడం కోసం జనం చేరినప్పుడు వారి మధ్యలో ఓ మానవ బాంబు పేల్చేసుకున్నాడని ఓ పోలీసు అధికారి చెప్పారు. ఈ జంట పేలుళ్లలో కనీసం 28 మంది చనిపోగా, మరో 65 మంది గాయపడ్డారు. కొద్దిసేపు తర్వాత దక్షిణ బాగ్దాద్‌లోని దోరా నివాస ప్రాంతంలో ఉన్న పండ్లు, కూరగాయల మార్కెట్లో ఒక కారుబాంబు పేలడంతో 18 మంది మంది చనిపోగా, 35 మంది గాయపడ్డారని మరో పోలీసు అధికారి చెప్పారు. గత ఆదివారం ఐఎస్ మిలిటెంట్లకు, ఇరాక్ భద్రతా దళాలకు భీకర పోరు జరిగిన బాజి పట్టణంలోని సహజవాయు కర్మాగారంలో మంగళవారం తిరిగి ఉత్పత్తి మొదలైంది.

ఆ పోరులో ఎనిమిది మంది సైనికులు, ఆరుగురు పౌరులు చనిపోగా, మరో 27 మంది జవాన్లు గాయపడ్డారు.

బాగ్దాద్ మార్కెట్లో మంగళవారం బాంబు పేలుళ్ల అనంతర దృశ్యం