జాతీయ వార్తలు

స్తంభించిన ఉభయ సభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఎన్‌డిఏ ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపునకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ సభ్యుల శుక్రవారం వరుసగా నాలుగో రోజు సృష్టించిన గొడవ, గందరగోళం మూలంగా పార్లమెంటు ఉభయ సభలు స్తంభించిపోయాయి. రాజ్యసభ పూర్తిగా స్తంభించిపోగా లోక్‌సభ మాత్రం ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేయటంతో సజావుగా కొనసాగింది. కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభలో ఈరోజు కూడా నినాదాలతో బీభత్సం సృష్టించారు. రాజ్యసభ ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు వి.హనుమంతరావు, ఎం.ఏ.ఖాన్ మరికొందరు పోడియం వద్దకు దూసుకు వచ్చి సభ దద్దరిల్లిపోయేలా అరుస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. కాంగ్రెస్ సభ్యులందరూ కలిసి హూం అంటూ పెద్దఎత్తున నినదించటంతో సభ దద్దరిల్లిపోయింది. చైర్మన్ హమీద్ అన్సారీ వారికి నచ్చజెప్పేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. దీనితో ఆయన సభను అర్ధగంట వాయిదా వేశారు. సభ తిరిగి సమావేశమైన తరువాత కూడా కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్దకు వచ్చి గొడవ చేశారు. ఎం.ఏ.ఖాన్, హనుమంతరావు కె.వి.పి రామచందర్‌రావు మరికొందరు సభ్యులు పోడియం వద్ద నినాదాలతో హంగామా చేశారు. కాంగ్రెస్ సభ్యుల గొడవ మూలంగా రాజ్యసభ మొత్తం ఐదుసార్లు వాయిదా పడిన అనంతరం చివరకు నాలుగున్నర ప్రాంతంలో సోమవారం వరకు వాయిదా పడింది.
లోక్‌సభ ఈరోజు ఉదయం పదకొండు గంటలకు సమావేశం కాగానే కాంగ్రెస్ సభ్యులు రోజువారీ మాదిరిగానే పోడియం వద్దకు వచ్చి గొడవ చేశారు. అయితే స్పీకర్ సుమిత్రా మహాజన్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగిన గంటపాటు కాంగ్రెస్ సభ్యులు పోడియం వద్ద నిలబడి గొడవ చేస్తూనే ఉన్నారు. జీరో అవర్‌లో కూడా కాంగ్రెస్ సభ్యులు కొంతసేపు తమ నినాదాల కార్యక్రమాన్ని కొనసాగించిన అనంతరం సభ నుండి వాకౌట్ చేశారు. ఎన్‌డిఏ ప్రభుత్వం కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్షాలపై కొనసాగిస్తున్న కక్ష సాధింపు చర్యలకు నిరసనగా తమ పార్టీ సభ నుండి వాకౌట్ చేస్తోందని కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు. కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేసిన అనంతరం లోక్‌సభ కార్యక్రమాలు ప్రశాంతంగా కొనసాగాయి.