జాతీయ వార్తలు

నెస్లే ఇండియాకు సుప్రీం నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తిదారు నెస్లే ఇండియాకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రమాణాలకు లోబడే ఉత్పత్తి అవుతున్నట్టు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఇన్‌స్టెంట్ నూడుల్స్‌గా ప్రాచుర్యం పొందిన మ్యాగీలో సీసం, ఎంఎస్‌జిలు అధికంగా ఉన్నట్టు తేలడంతో దేశ వ్యాప్తంగా వాటిని నిషేధించారు. తరువాత లేబొరేటరీలో జరిపిన పరీక్షల్లో ప్రమాణాలకు లోబడే మ్యాగీ నూడుల్స్‌ను ఉత్పత్తి చేస్తున్నట్టు తేలింది. దీంతో మ్యాగీపై నిషేధం ఎత్తివేస్తూ బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పును అనుసరించి నెస్లే ఇండియా కంపెనీ మళ్లీ మార్కెట్‌లోకి ఉత్పత్తులను ప్రారంభించింది. స్నాప్‌డీల్ ఆన్‌లైన్ ద్వారా మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఇలా ఉండగా బాంబే హైకోర్టు తీర్పును ఎఫ్‌ఎస్‌ఎఏఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. పిటిషన్‌ను విచారించిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రపుల్ సి పంత్‌లు కూడిన ధర్మాసనం నెస్లే ఇండియా అలాగే మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జనవరి 13కు వాయిదా వేశారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోర్టుకు హాజరై వాదనలు వినిపించారు.