జాతీయ వార్తలు

స్వచ్ఛ ఇంధనం... అభివృద్ధి వేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఓవైపు పర్యావరణానికి హాని చేయని విద్యుత్‌కు కట్టుబడి ఉంటూనే మరోవైపు తన అభివృద్ధి లక్ష్యాలను సాధించుకోవడం అనేది భారత దేశానికి పెద్ద బాధ్యతే కాక సవాలు కూడానని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ‘ప్రపంచ జనాభాలో 17 శాతం భారత్‌లో ఉంది. అయినప్పటికీ దాని ఇంధన, విద్యుత్ వినియోగం ప్రపంచ వినియోగంలో దాదాపు అయిదు శాతంగా మాత్రమే ఉంది’ అని ఆయన అన్నారు. పారిస్‌లో ఓ వైపు పర్యావరణంపై కీలక సమావేశం జరుగుతున్న సమయంలో రాష్టప్రతి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక్కడి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సర్వోదయ విద్యాలయ పాఠశాలలో శుక్రవారం ‘ఉమంగ్-2015’ పేరుతో విద్యుత్‌పై ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని రాష్టప్రతి ప్రారంభించారు. భారత దేశ తలసరి ఇంధన, విద్యుత్ వినియోగం ప్రపంచ సగటు తలసరి వినియోగంలో మూడో వంతుకన్నా తక్కువేనని ప్రణబ్ అన్నారు. రాష్టప్రతి ఎస్టేట్‌లో ఉన్న ఈ పాఠశాలను ఆయన సౌర విద్యుత్‌తో నడిచే గ్రీన్‌స్కూల్‌గా ప్రకటించడమే కాకుండా ఇంధన రంగానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి రూపొందించిన ‘సజాగ్’ అనే యాప్‌ను సైతం ప్రారంభించారు.
భారత దేశం రాబోయే రెండు దశాబ్దాల్లో నిలకడగా ఎనిమిది శాతం వృద్ధిని సాధించాలంటే దాని ఇంధన సరఫరా కనీసం మూడు, నాలుగు రెట్లు, విద్యుత్ సరఫరా కనీసం అయిదునుంచి ఏడు రెట్లు పెరగాల్సిన అవసరం ఉందని రాష్టప్రతి అన్నారు. అందువల్ల మన అభివృద్ధి లక్ష్యాలను సాధించడం, అదే సమయంలో పర్యావరణానికి హాని చేయని విద్యుత్‌కు కట్టుబడి ఉండడం అనే భారీ బాధ్యతతో పాటు పెద్ద సవాలు మనపై ఉందని ఆయన అన్నారు. ప్రతివ్యక్తీ తన వంతు కృషి చేయడం ద్వారా మనం ఈ లక్ష్యాన్ని సాదించగలమని ఆయన అంటూ, లక్ష్యం అసాధ్యమైందేమీ కాదు కానీ కష్టమైందని అన్నారు.