అంతర్జాతీయం

ఇంకా ఎంతో చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిల్లాంగ్, మే 27: ఆగ్నేయాసియాకు ఈశాన్య భారతం ముఖద్వారమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. తూర్పు దృక్కోణంతోనే తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని, ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి వౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తోందని శుక్రవారం నాడిక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో స్పష్టం చేశారు. అయితే ఈ ప్రాంత సమగ్ర వికాసానికి ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్న విషయాన్ని స్పష్టం చేసిన ఆయన ఈ పర్యటన సందర్భంగా మూడు కొత్త రైళ్లను ప్రారంభించారు. ఈశాన్య భారతంలోని అన్ని రాష్ట్రాలను రైలు మార్గం ద్వారా అనుసంధానం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అదేవిధంగా రహదారులు, టెలికాం, విద్యుత్, జలమార్గాలను కూడా ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఇప్పటివరకు ఎంతో అభివృద్ధి జరిగినప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్న సహజ వనరులను వౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలంటే ఇంకా ఎంతగానో కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేంద్రంలో ఎన్‌డిఏ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఈ ప్రాంతంలో రైల్వే నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి పదివేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చుచేయడం జరిగిందన్నారు. అలాగే మరో ఐదువేల కోట్ల రూపాయలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఇందుకోసం వెచ్చించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ ప్రాంతంలో టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతో అవకాశం ఉందని వెల్లడించారు. వివిధ దేశాలనుంచి వచ్చే టూరిస్టులకు అన్ని రకాలుగా వౌలిక సదుపాయాలను కల్పించి విదేశీ మారకద్రవ్య ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్వదేశ్ దర్శన్ కార్యక్రమాన్ని చేపట్టిందని, ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ టూరిస్టు సర్క్యూట్లను ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. ఇలాంటి ఓ సర్క్యూట్‌ను ఈశాన్య భారతానికి కూడా అందించనున్నామన్నారు. ఈశాన్య భారతం ప్రకృతి సౌరభానికి, సాహస క్రీడలకు కూడా ఎంతగానో అవకాశాన్ని ఇచ్చేదేనని వెల్లడించారు.