జాతీయ వార్తలు

ఐదు నిమిషాలు... 20 ప్రశ్నలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 27: ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకోవాలని ఉందా? అయితే ఎన్డీఏ సర్కార్ పాలనపై మీ అవగాహనకు పదును పెట్టుకోండి. ఈ విషయంలో 20 ప్రశ్నలకు ఐదే ఐదు నిమిషాల్లో జవాబు చెప్పగలిగితే మీ కల నిజవౌతుంది. మీరు ప్రధానిని కలుసుకోవడమే కాదు, ఆయన సంతకంతో ఓ సర్ట్ఫికెట్ కూడా సొంతమవుతుంది. పాలనాపరమైన అంశంపై ప్రభుత్వం ఈ క్విజ్‌ను నిర్వహిస్తోంది.
దీని వెనుకనున్న ప్రధాన ఉద్దేశం పాలనా ప్రక్రియను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల ప్రజలకు ఎంత అవగాహన ఉందో తెలుసుకోవడమే. ఈ ఇరవై ప్రశ్నలను క్వశ్చన్ బ్యాంక్‌నుంచి సేకరించి, ఏ ఒక్కరికీ ఒకే రకమైన ప్రశ్న రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు 2015-16లో సౌర ఇంధన సామర్థ్యం ఏమిటన్న ప్రశ్న కూడా రావచ్చు. అలాగే డిబిటి పథకం ద్వారా ఇప్పటివరకు ఎంత మొత్తం బదిలీ అయింది అని కూడా అడగవచ్చు. బేటీ బచావో కార్యక్రమం ఎన్ని జిల్లాలకు విస్తరించిందో చెప్పాలని కూడా ప్రశ్నించవచ్చు. మొత్తం నాలుగు ఆప్షన్స్‌లో ఏదో ఒకదానిని ఎంచుకుని చకచకగా ఐదు నిమిషాల్లో ఇరవై ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సి ఉంది. ఒక ప్రశ్నకు చాలామంది సరైన జవాబు చెబితే ఎవరు తక్కువ వ్యవధిలో దీన్ని పూర్తిచేశారో వారినే విజేతలుగా ప్రకటిస్తారు. అంతేకాదు, కఠిన ప్రశ్నలను దాటవేయడానికి, తరువాత ఆ ప్రశ్నకు జవాబు చెప్పే వెసులుబాటు కూడా ఉంటుంది.