జాతీయ వార్తలు

ఉగ్రవాదానికి మద్దతు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 27: భారత్, పాకిస్తాన్‌ల మధ్య శాంతి పథం అనేది ఇరు దేశాలకు సంబంధించినదని, ఇరు దేశాలు కృషి చేస్తేనే శాంతియుత సంబంధాలు నెలకొంటాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలకు పాకిస్తాన్ స్వయంగా విధించుకున్న ఉగ్రవాదం అనే అడ్డంకి ఉందని పేర్కొంటూ ఈ అడ్డంకిని తొలగించుకోవలసిన అవసరం ఉందని ఆయన పాకిస్తాన్‌కు హితవు పలికారు. రాజ్య, రాజ్యేతర ఉగ్రవాదం దేనికయినా, ఎలాంటి మద్దతునయినా వెంటనే పూర్తిగా నిలిపివేయాలని ఆయన పాకిస్తాన్‌కు పిలుపునిచ్చారు. ‘మా స్నేహ సంబంధాల పథంలో పాకిస్తాన్ స్వయంగా విధించుకున్న ఉగ్రవాదం అనే అడ్డంకిని తొలగించుకుంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు నిజంగా నూతన శిఖరాలను తాకుతాయి. తొలి అడుగు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాని, శాంతి పథం అనేది రెండు వైపులా సాగే వీధి వంటిది’ అని మోదీ ‘ద వాల్‌స్ట్రీట్ జర్నల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్‌లు పరస్పరం పోరాడుకునే బదులు ఇరు దేశాలు కలిసి పేదరికంపై పోరాడాలని తాను ఎప్పుడూ చెబుతుంటానని మోదీ అన్నారు. పాకిస్తాన్ తన వంతు పాత్ర నిర్వహించాలని తాము సహజంగానే కోరుకుంటామని అన్నారు. ‘ఉగ్రవాదంపై రాజీ పడలేమని, ఉగ్రవాదానికి అన్ని రకాల మద్దతును నిలిపివేసినప్పుడే దాన్ని నిలువరించగలుగుతాము’ అని మోదీ అన్నారు. ఉగ్రవాద దాడుల సూత్రధారులను శిక్షించడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవడంలో పాకిస్తాన్ వైఫల్యం వల్ల మా సంబంధాలలో పురోగమనానికి పరిమితులు ఏర్పడుతున్నాయి’ అని భారత ప్రధాని అన్నారు. తన ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజునుంచే పొరుగు దేశాలలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలనే అజెండాతో పనిచేస్తున్నదని మోదీ చెప్పారు. ఈ విశ్వాసంతోనే తాను లాహోర్‌లో పర్యటించానని ఆయన తెలిపారు.
భారత్ దశాబ్దాల తరబడి అనుసరిస్తున్న అలీన విదేశాంగ విధానంలో మార్పు ఉండబోదని పేర్కొంటూ చైనాతో సరిహద్దు వివాదం ఉన్నప్పటికీ ఇరు దేశాల మధ్య ఎలాంటి ఘర్షణలు లేవని మోదీ అన్నారు. గత శతాబ్దంలో వలె కాకుండా ఈనాటి ‘స్వతంత్ర ప్రపంచం’ (ఇండిపెండెంట్ వరల్డ్)లో ‘కొత్తమార్గం’ ఉందన్నారు. వారసత్వంగా సంక్రమించిన భారత అలీన విదేశాంగ విధానాన్ని మార్చడానికి తగిన కారణమేదీ లేదని, ఆ విధానం అలాగే కొనసాగుతుందని ప్రధాని స్పష్టం చేశారు. అయితే గతంలోలాగా భారత్ ఓ మూలన నిలబడదని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం, అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌కు ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా తన బాధ్యతలు తెలుసని ఆయన అన్నారు.