జాతీయ వార్తలు

అసోంలో 4 బూటకపు ఎన్‌కౌంటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 27: అసోంలో నాలుగు బూటకపు ఎన్‌కౌంటర్లు జరిగినట్లు జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సి) నిర్ధారించింది. ఈ బూటకపు ఎన్‌కౌంటర్లలో మృతి చెందిన ఆరుగురు బాధితుల కుటుంబాలకు కలిపి మొత్తం రూ. 30 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని అసోం ప్రభుత్వాన్ని, రక్షణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. అసోంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్మీ యూనిట్లు, పారా మిలిటరీ బలగాలతో పాటు అసోం పోలీసులు జరిపిన 4 ఎన్‌కౌంటర్లు బూటకమైనవిగా ఎన్‌హెచ్‌ఆర్‌సి కనుగొంది. వీటిలో మూడు కేసుల్లో బూటకపు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన బాధితుల కుటుంబ సభ్యులకు మొత్తం రూ. 25 లక్షలు పరిహారంగా చెల్లించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సి అసోం ప్రభుత్వాన్ని ఆదేశించింది. నాలుగో కేసులో బాధితుని కుటుంబానికి రూ. 5 లక్షలు పరిహారంగా చెల్లించాలని రక్షణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది.
ఎన్‌హెచ్‌ఆర్‌సి ఈ మేరకు ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. ఈ ఎన్‌కౌంటర్ కేసులపై తాను జారీ చేసిన నోటీసులకు అసోం ప్రభుత్వం నుంచి కాని రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి కాని సంతృప్తికరమైన సమాధానం లభించలేదని ఎన్‌హెచ్‌ఆర్‌సి పేర్కొంది.
2008 జూలై 23న నాగోన్ జిల్లాలో పోలీసు కాల్పుల్లో మృతి చెందిన పికు అలీ కుటుంబానికి రూ. అయిదు లక్షలు చెల్లించాల్సిందిగా కమిషన్ ఆదేశించింది. 2011 ఫిబ్రవరి 23న రాత్రి డిస్పూర్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో మృగాంకా హజారికా, హిమాంషు గొగోయ్ మృతి చెందారు. ఈ మృతుల కుటుంబాలకు రూ. అయిదు లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. 2009 జూన్ 22న సోనిత్‌పూర్ జిల్లాలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో బసుమతరి, ఓఖోఫట్ బసుమతరి మృతి చెందారు. వీరి కుటుంబాలకు రూ. అయిదు లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సి ఆదేశించింది. వీరికి పరిహారం చెల్లించినట్లుగా ఆధారంతో పాటు ఎనిమిది వారాల్లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కమిషన్ ఆదేశించింది. 2009 జూలై 9న సోనిత్‌పూర్ జిల్లాలో అసోం పోలీస్, అసోం రైఫిల్స్ జరిపిన కాల్పుల్లో మృతి చెందిన రోజిత్ నర్జారి అలియాస్ అబ్రం కుటుంబానికి ఆరు వారాలలోగా రూ. అయిదు లక్షల పరిహారం చెల్లించాలని రక్షణ మంత్రిత్వ శాఖను ఎన్‌హెచ్‌ఆర్‌సి ఆదేశించింది.