జాతీయ వార్తలు

పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పోలవరం నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 27: పర్యావరణ అనుమతులకు విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు చేపడుతున్నారంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జిటి)లో పోలవరం రైతు సంక్షేమ సంఘం, రేలా స్వచ్ఛంద సంస్థలు పిటిషన్ దాఖలు చేశాయి. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల రద్దుకోరుతూ సవరణలతో కూడిన పిటిషన్ దాఖలు చేస్తే అప్పడు పరీశిలీస్తామని ఎన్‌జిటి తెలిపింది. ఈ పిటిషన్ శుక్రవారం ట్రిబ్యునల్‌లో జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణ కు వచ్చింది. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పోలవరం ప్రాజెక్టుకు 2005 లో పర్యావరణ అనుమతులు తీసుకొన్నారని, ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణాలు వాటికి పూర్తి విరుద్ధంగా జరుగుతున్నాయని ఎన్‌జిటి దృష్టికి తీసుకొచ్చారు.