జాతీయ వార్తలు

స్టే ఇవ్వలేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,మే 27: దేశవ్యాప్తంగా వైద్యవిద్య కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష (నీట్)ను ఏడాది పాటు వాయిదా వేస్తూ కేంద్ర తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ ఆర్డినెన్స్‌పై స్టే విధించాలని ఇండోర్ వైద్యుడు ఆనంద్‌రాయ్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. శుక్రవారం సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ జస్టిస్ పి.సి పంథ్, జస్టిస్ డి.వై. చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా తమకున్న పరిధిలో స్టే ఇవ్వడం రాజ్యాంగంలో ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లు అవుతుందని ధర్మాసనం అభిప్రాయం పడింది. అలాగే స్టే ఇవ్వలన్నా పిటిషనర్ వాదనలను కూడా వినాల్సిన అవసరం ఉందని తెలిపింది. వేసవి సెలవుల అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనాన్ని ఆశ్రయించాలని పిటిషనర్ తరపున్యాయవాదికి సూచించింది. ప్రస్తుతం సమయంలో కేంద్ర ఆర్డినెన్స్‌పై ఎలాంటి ఆదేశం జారీ చేసినా విద్యార్థుల్లో మరింత గందరగోళ పరిస్థితి నెలకొంటుందని తెలిపింది. ఆర్డినెన్స్‌కు సంబంధించి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులనూ జారీ చేయలేమని తెలిపింది. అర్డినెన్స్‌పై స్టే ఇవ్వాలన్న పిటషన్‌ను అటార్నీ జనరల్ ముఖుల్ రోహద్గీ వ్యతిరేకిస్తూ ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశాలకు, రాష్ట్రాల వైద్య సీట్ల భర్తీ చేసుకోనేందుకు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించేందుకే ఆర్డినెన్స్ జారీ చేశామని స్పష్టం చేశారు. నీట్ పరీక్షపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కాదని రాష్ట్రాల నుండి వచ్చిన ఒత్తిడుల మూలంగా కేంద్రం ఈ ఆర్డినెన్స్ జారీ చేసింది.