జాతీయ వార్తలు

ఇప్పుడున్న ఇంటి అదనపు నిర్మాణానికీ ప్రభుత్వ సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 1: ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను నిజం చేయడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లభించే సాయం కొత్తగా సొంతింటిని కట్టుకునే వారికే కాదు, ఇప్పుడున్న ఇంటికి అదనంగా కనీసం 9 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియాను చేర్చుకున్నా సరే ఈ పథకం కింద సాయం లభిస్తుంది. తాజాగా రూపొందించిన గైడ్‌లైన్స్ ప్రకారం ఈ పథకంలోని ‘బెనిఫిషరీ లెడ్ కన్‌స్ట్రక్షన్’ (బిఎల్‌సి) విభాగం కింద ఇప్పటికే పక్కా లేదా సెమీ పక్కా ఇళ్లు కలిగి ఉన్న లబ్ధిదారులు తమ ఇంటిని మరింత సౌకర్యవంతంగా చేసుకోవడానికి జరిపే అదనపు నిర్మాణానికి కూడా ప్రభుత్వ సాయం లభిస్తుంది. ఇప్పుడున్న పక్కా లేదా సెమీ పక్కా ఇంటికి అదనంగా జరిపే కనీసం 9 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియాకు కూడా లక్షన్నర రూపాయల ప్రభుత్వ సాయం లభిస్తుందని బుధవారం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటన తెలిపింది.
ఈ అదనపు నిర్మాణం జాతీయ భవన నిర్మాణ నిబంధనల ప్రకారం ఒక గది లేదా వంటగది లేదా బాత్‌రూమ్, లేదా టాయిలెట్‌తో కూడిన గది అయి ఉండాలని ఆ ప్రకటనలో తెలిపింది.
9 చదరపు మీటర్ల అదనపు కార్పెట్ ఏరియా తర్వాత ఇంటి మొత్తం కార్పెట్ ఏరియా 21 చదరపు మీటర్లకన్నా తక్కువ కానీ, 30 చదరపు మీటర్లికన్నా ఎక్కువ కానీ ఉండకూడదని కూడా ఆ గైడ్‌లైన్స్‌లో పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా బిఎల్‌సి విభాగం కింద ప్రతిపాదనలు పంపించేటప్పుడు ఈ నిబంధనలు పాటించేలా చూడాలని కోరుతూ కేంద్ర గృహనిర్మాణం, పట్టణ ప్రాంత పేదరికం నిర్మూలన మంత్రిత్వ శాఖ ఈ గైడ్‌లైన్స్‌ను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా పంపించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు.