జాతీయ వార్తలు

అక్రమం కాకుంటే ఆస్తులుండడం నేరం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 1: ఆస్తులు సంపాదించడం తప్పు కాదని, అయితే ఆ ఆస్తులు సక్రమమార్గంలో సంపాదించినవై ఉండాలని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను నిర్దోషిగా ప్రకటిస్తూ కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు మూర్ఖమైందని కర్నాటక ప్రభుత్వం వాదించిన సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఆస్తులు సంపాదించడం నేరం కాదు. ఆస్తులకోసం ఖర్చు చేసిన సొమ్ము అక్రమమైంది అయినప్పుడు మాత్రమే అది నేరమవుతుంది’ అని న్యాయమూర్తులు పిసి ఘోష్, అమితావ్ రాయ్‌లతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. సాధారణంగా వేసవి సెలవుల్లో సుప్రీంకోర్టు అత్యవసరమైన అంశాలను మాత్రమే విచారణకు స్వీకరిస్తుంది. అయితే జయలలిత అక్రమ ఆస్తులకు సంబంధించిన కేసులో ఇరుపక్షాలు కూడా వేసవి సెలవుల్లో విచారణకు హాజరు కావడానికి అంగీకరించడంతో సుప్రీంకోర్టు సెలవుల్లోనే ఈ కేసులో తుది వాదనలు వినడానికి నిర్ణయించింది. కాగా, తనముందు మూడు మార్గాలు అందుబాటులో ఉన్నాయని, హైకోర్టు తీర్పును సమర్థించడం లేదా కొట్టివేయడం ఏదయినా చేయవచ్చని, లేదా మొత్తం సాక్ష్యాలను పునస్సమీక్షించవచ్చని, అంటే కొత్తగా పునర్విచారణకు గానీ లేదా తిరిగి పరిశీలించాలంటూ హైకోర్టుకు తిప్పి పంపడం కానీ చేయవచ్చని విచారణ సందర్భంగా బెంచ్ వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పు ఊహకు సైతం అందని అసంబద్ధపు తీర్పు అని కర్నాటక ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే అన్నప్పుడు బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.
గత నెల తమిళనాడు ముఖ్యమంత్రిగా తిరిగి అధికారంలోకి వచ్చిన అన్నాడిఎంకె అధినేత్రి జయలలితపై కర్నాటక ప్రభుత్వం, డిఎంకె నాయకుడు కె అన్బళగన్ దాఖలు చేసిన పిటిషన్లను విచారిస్తున్న బెంచ్ వివిధ నిందితులకు పంచిన సొమ్ము జయలలితకు చెందినదని నిరూపించే సాక్ష్యాధారాలను చూపించాలని కర్నాటక ప్రభుత్వాన్ని కోరింది. అంతేకాదు ఈ సొమ్ము అక్రమ మార్గాల ద్వారా ఆర్జించిందని చూపించే సాక్ష్యాధారాలను చూపించాలని కూడా బెంచ్ కోరింది. కాగా,హైకోర్టు తన తీర్పులో తమిళనాడులో గిఫ్ట్‌లు ఇచ్చే సంస్కృతి ఉందని వ్యాఖ్యానించిందని, అలాంటి వ్యాఖ్య చేయాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని దవే అంటూ, అలా అయితే అవినీతి కేసుల్లో చిక్కుక్కున్న ప్రతి రాజకీయ వేత్తా నిర్దోషిగా బైటపడతాడని అన్నారు.