జాతీయ వార్తలు

ఆధార్ అనుసంధానం కోసం పెన్షనర్లకు ప్రాధాన్యత ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 3: తమ బ్యాంక్ ఖాతాలతో ఆధార్ నంబర్లను అనుసంధానం చేసుకోవడానికి బ్యాంకులకు వచ్చే పెన్షనర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని బ్యాంకులు ఆదేశాలు ఇచ్చినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేందర్ సింగ్ శుక్రవారం చెప్పారు. పెన్షనర్ల బ్యాం కు ఖాతాల్లో ఆధార్ నంబర్లు నమోదు చేయడానికి ఈ నెల 10వ తేదీ దాకా దేశవ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేసే బ్యాంకుల్లో, వాటి శాఖల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఎలాం టి ఇబ్బందీ లేకుండా ఆధార్ నంబర్ నమోదు కోసం పెన్షనర్లు తమ పెన్షన్ పేమెంట్ ఆర్డర్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్‌తో తమ పెన్షన్ చెల్లింపు శాఖలను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ శిబిరాల వల్ల పెద్ద సంఖ్యలో పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన చెప్పారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉండే పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు చేరువ కావడం కోసం ఈ కార్యక్రమానికి రేడియో జింగిల్స్, కరపత్రాలు, స్థానిక కేబుల్ టీవీ నెట్‌వర్క్‌లు లాంటి వాటి ద్వారా ప్రచారం కల్పించనున్నట్లు సింగ్ చెప్పారు. ‘జీవన్ ప్రమాణ్’ సదుపాయం పొందడం కోసం ఆధార్ నంబర్, పిపిఓ నంబరు, బ్యాంక్ ఖాతా నంబరును అనుసంధానం చేసుకునేలా పెన్షనర్లను, బ్యాంక్ శాఖలను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం, పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకులు అనేక చర్యలు తీసుకున్నాయని ఆయన చెప్పారు. వయోవృద్ధులు, అశక్తులైన పెన్షనర్లు లేదా ఫ్యామిలీ పెన్షనర్ల సదుపాయం కోసం పింఛన్లు, పెన్షనర్ల సంక్షేమ విభాగం ఈ ‘జీవన్ ప్రమాణ్’ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.
ఈ పథకం కింద పెన్షనర్లు తమ ఇంట్లోనే కూర్చుని పర్సనల్ ప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ద్వారా, లేదా దగ్గర్లో ఉండే కామన్ సర్వీస్ సెంటర్లు, లేదా పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకుకు చెందిన శాఖకు వెళ్లి డిజిటల్ లైఫ్ సర్ట్ఫికెట్లను సమర్పించవచ్చునని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. డిజిటల్ లైఫ్‌సర్ట్ఫికెట్లు సమర్పించడం అంటే పెన్షన్ చెల్లింపును ప్రామాణికత లభించడమే. ఇప్పటివరకు 15 లక్షలకు పైగా సర్ట్ఫికెట్లు సమర్పించడం జరిగిందని ఆ పత్రికా ప్రకటన తెలిపింది. దేశంలో 58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఉన్నారు. ఇదిలా ఉండగా ఆదార్‌ను జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఐఏ) పింఛనుదార్ల కోసం ప్రత్యేక నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 10 దాకా చేపడుతోంది.