జాతీయ వార్తలు

హేమా..నీకు తగునా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 3: సొంత నియోజకవర్గం అల్లర్లతో అట్టుడికిపోతుంటే స్పందించడం మానేసి ఎప్పుడో షూ టింగ్‌లో పాల్గొన్న ఫొ టోలను ట్విట్టర్‌లో పో స్టుచేసి మధుర ఎంపీ, న టి హేమమాలిని తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. భూ ఆక్రమణల తొలగింపులో చెలరేగిన అల్లర్లలో మధుర నగర ఎస్‌పి, ఓ సిఐ మృతి చెందినట్టు వార్తలొచ్చాయి. ఘర్షణల్నో 24 మంది వరకూ చనిపోయినట్టు తెలిసింది. అయితే మధుర నియోజకవర్గ ఎంపీ, నటి హేమమాలిని ఇవేవీ పట్టించుకోకుండా తాను షూటింగ్‌లో పాల్గొన్న ఫొటోలు ట్విట్టర్‌లో పెట్టారు. హేమమాలిని తీరు బిజెపిని ఇబ్బందికి గురిచేసింది. అయితే సామాజిక మాద్యమాల్లో ఆమె తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతే ట్విట్టర్‌లోని ఫొటోలు తొలగించిన మధుర ఎంపీ అల్లర్ల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మధురలో జరిగిన సంఘటన తననెంతో ఆవేదనకు గురిచేసిందని ఆమె చెప్పారు. తాను నియోజకవర్గం నుంచి తిరిగొచ్చిన తరువాత భూ ఆక్రమణల తొలగింపుహింసాత్మకంగా మారినట్టు తెలిసిందని ఎంపీ సర్దిచెప్పబోయింది. మధుర వెళ్లి బాధితులను ఓదార్చుతానని ఆమె వెల్లడించింది. ఈ అంశం సున్నితమైందన్న బిజెపి దీన్ని తప్పుదోవపట్టించొద్దని సలహా ఇచ్చింది. హేమ తీరుపై మండిపడిన పార్టీ శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత యూపీ ప్రభుత్వానిదేదని పేర్కొంది. స్థానిక ఎంపీగా హేమ నియోజకవర్గానికి వెళ్లి బాధితులను పరామర్శిస్తారని పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర చెప్పారు.