జాతీయ వార్తలు

దేశీయ విద్యాసంస్థల్లో ఇక అంతర్జాతీయస్థాయి సిలబస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 3: దేశంలోని విద్యాసంస్థల్లో అంతర్జాతీయ స్థాయి సిలబస్ రూపకల్పనకు విదేశీ నిపుణుల సహకారం తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల శాఖ సంకల్పించింది.
కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పెన్సిల్వేనియా యూనివర్శిటీ వంటి ప్రముఖ యూనివర్శిటీలకు చెందిన నిపుణుల సహకారంతో దేశీయ ఉన్నత విద్యాసంస్థల్లో సిలబస్‌ను రూపొందించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్‌బరో, ఎంఐటి, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ, పెన్సిల్వేనియా యూనివర్శిటీ, యుసి బర్క్‌లీ, వాషింగ్టన్ యూనివర్శిటీ, జార్జియా టెక్ యూనివర్శిటీ వంటి వాటి సహకారంతో ఉన్నత విద్య సిలబస్‌లో మార్పులు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా సోషల్ సైన్స్, సైన్స్, మేథమేటిక్స్, ఇంజనీరింగ్ విద్యలో ప్రస్తుతమున్న సిలబస్‌ను అంతర్జాతీయ స్థాయికి పెంచనున్నట్లు తెలిపారు. రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద పది ప్రాజెక్టులను ఆమె ఈ సందర్భంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో మోడల్ డిగ్రీ కాలేజీని ప్రారంభించిన ఆమె, అమృత్‌సర్‌లోని బాలుర హాస్టల్ విద్యార్థులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.