జాతీయ వార్తలు

నేడు విదేశీ పర్యటనకు మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 3: భారత దేశ విదేశాంగ సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నుంచి అమెరికా, మెక్సికో, ఖతర్, స్విట్జర్లాండ్, అఫ్గానిస్తాన్‌లలో పర్యటించనున్నా రు. 48 సభ్య దేశాలు కలిగిన అణు సరఫరా దేశాల కూటమిలో (ఎన్‌ఎస్‌జి) భారత్‌కు సభ్యత్వం కల్పించే విషయంలో మెక్సికో, స్విట్జర్లాండ్‌ల మద్దతును ఈ సందర్భంగా కోరబోతున్నారు. ఎన్‌ఎస్‌జిలో భారత్‌కు సభ్యత్వం రావాలంటే ఈ రెండు దేశాల మద్దతు అత్యంత కీలకం. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో జరిపే చర్చల్లో కూడా ఎన్‌ఎస్‌జి సభ్యత్వ అంశం ప్రస్తావనకు రాబోతోంది. స్విట్జర్లాండ్ నాయకత్వంతో జరిపే చర్చల్లో నల్లధన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ముందుగా కటర్ నాయకత్వంతో చర్చలు జరిపిన తర్వాత ఆదివారం రెండు రోజుల పర్యటనార్థం స్విట్జర్లాండ్ వెళతారు.