జాతీయ వార్తలు

గ్రామీణ వైద్యమే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా, జూన్ 3:దేశ జనాభాలో 75శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే జీవిస్తున్నందున వారికి సమగ్ర రీతిలో వైద్య సేవలను అందించడం ఓ పెద్ద సవాలేనని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. దీని దృష్ట్యా ప్రజలందరికీ నాణ్యతాయుతమైన, సమానత్వంతో కూడిన వైద్య సదుపాయాలను కల్పించే దిశగా బలమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఉద్ఘాటించారు. ఇక్కడి ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ స్వర్ణోత్సవ స్నాతకోత్సవానికి అధ్యక్షతన వహించిన రాష్టప్రతి ‘వైద్య సంరక్షణ ప్రజల వౌలిక అవసరం. వైద్య సేవా రంగాన్ని మరింతగా బలోపేతం చేసి గ్రామీణ ప్రాంతాలకు దీన్ని విస్తరించాలి’అని స్పష్టం చేశారు. స్నానకోత్సవమన్నది విద్యార్ధుల సుదీర్ఘ అధ్యయనానికి ముగింపు అని పేర్కొన్న ప్రణబ్ ఈ అనుభవాన్ని, నైపుణ్యాన్ని నిత్య జీవితంలో వృత్తి పరంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునేందుకు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గ్రామీ ణ ప్రాంత ప్రజలకు లోపరహితమైన రీతిలో వైద్య సేవలను కల్పించడం అంత తేలిక్కాదని చెప్పిన రాష్టప్రతి ఈ సమస్యను అధిగమించాలంటే భౌతికంగా వైద్య వ్యవస్థను గ్రామీణ ప్రాంతాల్లో బలోపేతం చేయాలని, ఆ విధంగా నాణ్యతాయుతమైన సేవల్ని అందించాలని తెలిపారు. కొత్తగా వైద్య వృత్తిలోకి ప్రవేశించే..ఇప్పటికే ఈ రంగంలో ఉన్న వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాలని పేర్కొన్న రాష్టప్రతి ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టిని సారించాలని కోరారు. దేశ జనాభా వైద్య అవసరాలు తీర్చే విధంగా నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని కూడా గణనీయంగా పెంచాలన్నారు. ‘నువ్వు కోరుకునే మార్పును నీలోనే నువ్వు చూసుకోవాలి’అన్న మహాత్మా గాంధీ సందేశాన్ని ఉటంకించిన ఆయన పేదలు, బలహీన వర్గాల సంక్షేమం గురించి ఆలోచించడం ద్వారానే సరైన నిర్ణయాలకు వచ్చేవారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా 97మందికి ఎంబిబిఎస్,87మందికి పోస్టు గ్రాడ్యుయేట్,, ఆరుగురికి సూపర్ స్పెషాలిటీస్ డిగ్రీలను రాష్టప్రతి ప్రదానం చేశారు.

చిత్రం... సిమ్లాలోని ఇందిరాగాంధీ వైద్య కళాశాల స్వర్ణోత్సవ స్నాతక కార్యక్రమంలో విద్యార్థులకు
డిగ్రీలను ప్రదానం చేస్తున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, పక్కన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఆచార్య దేవవ్రత