జాతీయ వార్తలు

నెల్లూరులో మెగా లెదర్ క్లస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూన్ 8: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కోట మండలంలో మెగా లెదర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర వాణిజ్య శాఖ ఆమోదం తెలిపింది. వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఒక లేఖ రాశారు. మెగా లెదర్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తన వంతు సహాయంగా 125 కోట్ల రూపాయలు ఇస్తుంది. భారత చర్మ పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కోట మండలంలో ఈ మెగా లెదర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో వివరించారు. మెగా లెదర్ క్లస్టర్‌లో మొదటి దశ కింద ఐదువందల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలున్నాయనీ, ఈ పెట్టుబడుల మూలంగా దాదాపు ఇరవై వేల మందికి ఉపాధి లభిస్తుందని నిర్మలా సీతారామన్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు చేయవలసిన పనులు పూర్తి చేస్తే కేంద్రం తమ వంతు సహాయాన్ని విడుదల చేయటం ద్వారా మెగా క్లస్టర్ నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేస్తుందని నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సూచించారు.