జాతీయ వార్తలు

నైరుతి వచ్చేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, జూన్ 8: ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. రుతుపవనాల ప్రభావం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కేరళలోని ఇదుక్కి జిల్లాలో భారీ వర్షాలకు ఒక వ్యక్తి మృతి చెందాడు. గత రాత్రి నుంచి కుండపోతగా వర్షాలు కురిశాయని తిరువనంతపురం ప్రాంతీయ వాతావరణ శాఖ డైరెక్టర్ కె సంతోష్ వెల్లడించారు.‘నైరుతి రుతుపవనాలు కేరళ, లక్షద్వీప్ తీరాన్ని తాకాయి. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో విస్తారంగా వర్షా లు పడుతున్నాయి’అని బుధవారం ఇక్కడ వెల్లడించారు. ఇదుక్కి జిల్లాలో నీట్లో జారిపడి జోబి జాన్(36) మృతి చెందాడు. ఆయన తల్లి తీవ్రంగా గాయపడ్డారు. వఝావర గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు బుధవారం కేరళ తీరాన్ని తాకడంతో మరి కొద్ది గంటల్లోనే రాష్ట్రాన్ని పలకరించనున్నాయి. ఈ మేరకు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. రుతుపవనాలు విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని తెలిపారు. ఇక దక్షిణ ఒడిశా నుంచి ఉత్తర కోస్తా వరకూ పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉపరితల ఆవర్తనం భూమి నుంచి 3.1- 4.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీనికి వివిధ ప్రాంతాల్లో ఏర్పడిన క్యుములోనింబస్ మేఘాలతో రాష్ట్రంలో బుధవారం పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. గడచిన 24 గంటల్లో చింతూరులో 62.4 మిల్లీమీటర్లు, పాలకోడేరులో 62.0, గంటూరులో 62,4, కొండపల్లిలో 58, పార్వతీపురంలో 49.4, బొబ్బిలిలో 52.4, పూసపాటిరేగలో 58.0, నర్సీపట్నంలో 47.6, మచిలీపట్నంలో 45.4, విశాఖలో 37 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.