అంతర్జాతీయం

భారత్‌పై కుట్రలు ఆపండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 10: భారత్‌లో దాడులకు కుట్ర పనే్నందుకు ఉగ్రవాదులు పాకిస్తాన్‌లోని భూభాగాలను ఉపయోగించుకోకుండా చూడాలని దాయాది దేశాన్ని అమెరికా హెచ్చరించింది. పాకిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాకు తెలియజేయడంతో దాయాది దేశానికి అగ్రరాజ్యం ఈ విషయాన్ని స్పష్టం చేసిం ది. భారత్‌తో సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు పాకిస్తాన్ చేపట్టవలసిన చర్యల్లో ఇదొకటని అమెరికా పేర్కొన్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ డిప్యుటీ అధికార ప్రతినిధి మార్క్ టోనర్ గురువారం వెల్లడించారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకుని, సహకారాన్ని పెంపొందించుకోవడం లక్ష్యంగా ప్రత్యక్ష చర్చలను ప్రోత్సహిస్తే ఇరు దేశాలకు ప్రయోజనం చేకూరుతుందని అమెరికా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం పాకిస్తాన్ పలు చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని, భారత్‌పై దాడులకు వ్యూహరచన చేసేందుకు ఉగ్రవాదులు పాక్ భూభాగాలను ఉపయోగించుకోకుండా చూడటం ఈ చర్యల్లో ఒకటని టోనర్ స్పష్టం చేశారు. భారత్‌పై దాడులకు కుట్ర పన్నుతున్న ఉగ్రవాద గ్రూపులన్నీ ప్రస్తుతం పాక్ భూభాగాలను కేంద్రంగా చేసుకునే పనిచేస్తున్నాయని, వీటిని నిర్మూలించే విషయంలో పాకిస్తాన్‌కు అవసరమైన సహాయ సహకారాలను అందజేస్తామని ఆయన చెప్పారు. నరేంద్ర మోదీకి, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు మధ్య చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన అంశాల్లో పాకిస్తాన్ అంశం కూడా ఒకటని మార్క్ టోనర్ ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.