జాతీయ వార్తలు

ఫిరాయింపులు దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరటంపట్ల హైకమాండ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మంగళవారం తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డితో సమావేశమై కాంగ్రెస్ నేతల పార్టీ ఫిరాయింపుపై సమీక్ష జరిపారు. రాహుల్‌తో దాదాపు గంటపాటు చర్చలు జరిపిన అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌తో భేటీ అయ్యారు. లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వి వివేక్, ఆయన సోదరుడు జి వినోద్ తదితరులు తెరాసలో చేరిపోవటానికి దారితీసిన పరిస్థితులపై చర్చించారు. వీరి రాజీనామాపై ఉత్తమ్‌కుమార్ రెడ్డి తన వాదన వినిపించారు. పార్టీ ఫిరాయింపులు, అంతర్గత కుమ్ములాటల గురించి హైకమాండ్‌కు వివరించినట్టు ఉత్తమ్‌కుమార్ మీడియాకు వెల్లడించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలను హైకమాండ్ దృష్టికి తెచ్చానన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో అన్ని అంశాలపై సమాలోచనలు జరుగుతాయని ఉత్తమ్‌కుమార్ వివరించారు. దిగ్విజయ్ సింగ్‌తోపాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కార్యదర్శి కుంతియా, కె రాజు సమన్వయ కమిటీ సమావేశానికి హాజరువుతున్నారని తెలిపారు.
గుత్తా వెళ్లిపోవటమే మంచిది
చెరువులు ఎండిపోయినప్పుడు కప్పలు బైటికి వెళ్లిపోయినట్టు గుత్తా సుఖేందర్ రెడ్డి తదితరులు కాంగ్రెస్‌ను వీడిపోయారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ అధికారం కోసం కాంగ్రెస్‌లో చేరిన వారే ఇప్పుడు ఆ అధికారం కోసమే తెరాసలో చేరుతున్నారని విమర్శించారు. ఇలాంటివారు వెళ్లిపోవడం కాంగ్రెస్‌కు మేలే అన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డికి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు కాంట్రాక్టు లభించిందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులకు కొన్ని కాంట్రాక్టులు ఇవ్వాలని సిఎం కెసిఆర్ ఆదేశించారని తెలిపారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలకు క్షమాపణలు చెప్పి కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలని ఆయన గుత్తా సుఖేందర్ రెడ్డిని డిమాండ్ చేశారు. పార్టీని వదిలిపెట్టి పోతున్న నాయకులు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.