అంతర్జాతీయం

భారత్‌తో వాణిజ్య ఒప్పందం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 20: భారత్, చైనా వంటి పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థలతో వాణిజ్యాన్ని మరింత పెంపొందించుకోవలసిన అవసరం ఉందని బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ అన్నారు. ముఖ్యంగా భారత్‌తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవలసిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో యూరోపియన్ యూనియన్ (ఇయు)లో బ్రిటన్ కొనసాగి తీరాలని ఆయన పేర్కొన్నారు. గురువారం జరిగే కీలక రెఫరెండంలో యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ కొనసాగడానికి వీలుగా ఓటు వేయాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాన మార్కెట్‌తో బ్రిటన్ సంబంధాలు తెంపుకోవడం ‘ఆర్థిక వెర్రితనం’ అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి ప్రత్యేక బిబిసి ‘క్వొశ్చన్ టైమ్’ షోలో ప్రేక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు కామెరాన్ బదులిచ్చారు. 1972లో మనం చేరినప్పటి నుంచి యూరోపియన్ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థలు చాలాబాగా అభివృద్ధి చెందాయని ఆయన అన్నారు. బ్రిటన్.. భారత్‌తో కలిసి ఎంతో చేయగలుగుతుందని, అయితే యూరోపియన్ యూనియన్‌తో సంబంధాలు తెంచుకుంటే మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన అన్నారు. ప్రపంచ వాణిజ్యంలో యూరోపియన్ యూనియన్ వాటా 20 శాతం నుంచి 15 శాతానికి ఎందుకు తగ్గిందనే ప్రశ్నకు ఆయన బదులిస్తూ, ఇయు వాటా తగ్గినప్పటికీ ప్రపంచంలోని ఇతర కూటముల వాటాలతో పోలిస్తే ఇయు వాటా పెరిగిందని ఆయన వివరించారు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలో సుమారు 80 శాతం బీమా, బ్యాంకింగ్, ఆర్కిటెక్చర్, అమ్మకాలు వంటి సేవలకు సంబంధించిందేనని ఆయన వెల్లడించారు. ‘ఈ రోజు మనం మొత్తం భారత్‌కు విక్రయిస్తున్న సేవలకన్నా ఎక్కువ సేవలను వాయువ్య యూరప్‌లోని లక్సెంబర్గ్ దేశానికి విక్రయిస్తున్నాం. అయితే భారత్‌తో మరింత మెరుగుగా కలిసి పనిచేయవలసిన అవసరం ఉంది. ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవలసిన అవసరం ఉంది. అంటే దానర్థం మనం మన ప్రధాన మార్కెట్‌తో సంబంధాలు తెంపుకోవాలని కాదు. అలా తెంపుకుంటే అది ‘ఆర్థిక వెర్రితనం’ అవుతుంది’ అని కామెరాన్ అన్నారు.