జాతీయ వార్తలు

నమ్మక ద్రోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ కోల్‌కతా, జూన్ 20:కేంద్ర ప్రభుత్వం తాజా గా ప్రకటించిన రెండో దశ ఆర్థిక సంస్కరణల విధానంపై ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, సిపిఎంలు తీవ్ర స్వరంతో విరుచుకు పడ్డాయి. కేంద్రం చేపట్టిన సంస్కరణలు ప్రజా విశ్వాసానికి తీవ్ర విఘాతం కలిగించేవేనని, నమ్మక ద్రోహమని స్వదేశీ జాగరణ్ మంచ్ ధ్వజమెత్తింది. ఎఫ్‌డిఐ సంస్కరణల వల్ల కొత్తగా ఉద్యోగాలు ఏమీ రావని, భారతీయులకు ఉద్యోగాలు లేకుండా చేయడమే వీటి ఉద్దేశమని తెలిపింది. ముఖ్యంగా స్థానిక వ్యాపారస్తులకు ఈ సంస్కరణలు చావుదెబ్బలాంటివేనని వ్యాఖ్యానించింది. రిటైల్, రక్షణ, ఫార్మా వంటి రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం ప్రజాద్రోహం తప్ప మరేమీ కాదని స్వదేశీ జాగరణ్ మంచ్ జాతీయ సహకన్వీనర్ అశ్వినీ మహాజన్ అన్నారు. దీని వల్ల దేశానికి గానీ స్థానిక వ్యాపారస్తులకు గానీ ప్రభుత్వం చేసిన మేలేమీ లేదన్నారు. రక్షణ రంగంలో అనుసరిస్తున్న విధానాల్లో విస్తృత మార్పులు చేయడం జాతీయ భద్రతకే పెద్దముప్పు అని ప్రతిపక్ష పార్టీలు విరుచుకు పడ్డాయి. తక్షణమే వీటిని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆర్‌బిఐ గవర్నర్ పదవి నుంచి తప్పుకుంటానని రఘురామ్ రాజన్ ప్రకటించి ఉండకపోతే ప్రభుత్వం ఎఫ్‌డిఐ సంస్కరణల విధానాన్ని ప్రకటించి ఉండేదని కాదని కాంగ్రెస్ ప్రతినిధి జైరామ్ రమేష్ అన్నారు. రక్షణ రంగంలో ఎఫ్‌డిఐని నూటికి నూరుశాతం అనుమతించడం నాటో-అమెరికా రక్షణ ఉత్పత్తిదారుల చేతుల్లోకి రక్షణ రంగాన్ని అప్పగించడమే అవుతుందని మాజీ రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ అన్నారు. ప్రభుత్వ విధానం వల్ల జాతీయ భద్రతకే కాకుండా ఇప్పటి వరకూ అనుసరిస్తూ వస్తున్న స్వతంత్య్ర విదేశాంగ విధానానికీ ముప్పేనని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాతే ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. రక్షణ రంగంలోకి ఎఫ్‌డిఐని అనుమతించడం ప్రమాదకర పరిణామమని, ప్రపంచ వ్యాప్తంగా అతి కొద్ది దేశాలు మాత్రమే అత్యంత సునిసితమైన ఈ రంగంలోకి ఎఫ్‌డిఐలను అనుమతిస్తున్నాయని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మేక్ ఇన్ ఇండియా పేరుతో నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు.