జాతీయ వార్తలు

బ్రిటన్‌తో బలపడనున్న ఆర్థిక బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 24: యూరోపియన్ యూనియన్ (ఇయు) నుంచి బ్రిటన్ వైదొలగడం అనేది ఆ రెండింటికి సంబంధించిన అంశమే కాదు. దీని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల మీద పడుతుంది. ఇయు నుంచి బ్రిటన్ వైదొలగాల్సిందేనని ఆ దేశ ప్రజలు రెఫరెండంలో ఇచ్చిన తీర్పు వెలువడిన వెంటనే భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలడం దీనికి ఒక సంకేతం. అందుకే ఇయు నుంచి బ్రిటన్ వైదొలగటం (బ్రెగ్జిట్) వల్ల భారతదేశంపై పడే తక్షణ, దీర్ఘకాలిక ప్రభావాలపై విస్తృతంగా చర్చ సాగుతోంది. మార్కెట్ వర్గాలు భయపడినట్లు ఈ ప్రభావం అంతా ప్రతికూలంగానే ఉంటుందా? ఏమైనా సానుకూలతలు ఉంటాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బ్రిటన్ సహా యూరోపియన్ యూనియన్‌కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటి) సేవలను అందిస్తున్న భారత్‌పై బ్రెక్సిట్ ప్రభావం తప్పకుండా పడుతుందని నిపుణులు విశే్లషిస్తున్నారు. భారత్‌లోని ఐటి పరిశ్రమపై బ్రెక్సిట్ తక్షణ ప్రభావం ఏంటంటే, బ్రిటిష్ పౌండ్ విలువ తగ్గిపోయి, ప్రస్తుతం కుదుర్చుకొని ఉన్న అనేక ఒప్పందాలను ప్రభావితం చేస్తుంది. దీన్ని నివారించుకోవాలంటే తిరిగి సంప్రదింపులు జరుపుకోవలసి ఉంటుంది.
అయితే దీర్ఘకాలంలో భారత్- బ్రిటన్ ఆర్థిక సంబంధాలు బలోపేతం కావడానికి బ్రెగ్జిట్ దోహదపడుతుంది. ఇయు నుంచి బయటకు రావడం వల్ల ఆ మార్కెట్లను కోల్పోయిన బ్రిటన్.. భారత్‌తో ఆర్థిక సంబంధాలను పటిష్ఠం చేసుకోవడం ద్వారా పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. భారతీయ ఐటి కంపెనీలు తమ ఆదాయంలో 6-18 శాతం బ్రిటన్ నుంచి పొందుతున్నాయి. ఈ కంపెనీలు యూరప్‌లో ప్రవేశించడానికి బ్రిటన్ ప్రధాన ద్వారంగా ఉంటూ వచ్చింది. లండన్‌లో ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని యూరోపియన్ మార్కెట్‌కు సేవలందిస్తున్నాయి.
‘ఇప్పుడు బ్రెగ్జిట్ ప్రతికూల ప్రభావం ఏంటంటే, భారతీయ ఐటి కంపెనీలు యూరోపియన్ యూనియన్ కోసం ప్రత్యేక ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలు నిర్వహించాలి. అంటే బ్రిటన్ నుంచి కొంత వరకు పెట్టుబడులను ఉపసంహరించుకొని ఇయులో పెట్టాలి. కొంత వరకు కార్యకలాపాలను బ్రిటన్ నుంచి ఇయుకు మళ్లించాలి’ అని నాస్‌కామ్ విశే్లషించింది.
భారత స్టాక్ మార్కెట్లు భారీ పతనమవడంతో పాటు అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా 68కి తగ్గిపోయినప్పటికీ, ఇతర అనేక దేశాల కరెన్సీతో పోలిస్తే భారత కరెన్సీ మారకం విలువ స్వల్పంగానే తగ్గిందని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) పేర్కొనడం విశేషం. ప్రభుత్వం ఎంతగా భరోసా ఇస్తున్నప్పటికీ బ్రెక్సిట్ ప్రతికూల ప్రభావం నేరుగా పడుతుందని దేశీయ మదుపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిటన్‌లో పెట్టుబడులు కలిగి ఉన్న భారత కంపెనీలు, రంగాలపై ఈ ప్రతికూల ప్రభావం ఉంటుందని వారు పేర్కొంటున్నారు.
వచ్చే వారం మార్కెట్‌లో కొంత స్థిరత్వం ఏర్పడుతుందని, ఆ తరువాత సరసమైన ధరల్లో లభ్యమయ్యే మంచి నాణ్యత గల స్టాక్స్‌ను మదుపరులు కొనుగోలు చేయాలని సామ్కో సెక్యూరిటీస్ సిఇఒ జిమీత్ మోడి సూచించారు.
‘యూరప్, బ్రిటన్ నుంచి గణనీయమైన ఆదాయం పొందుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటి), ఇతర కంపెనీలు ప్రతికూల ప్రభావానికి గురవుతాయి. పౌండ్ ప్రభావం ఎంత వరకు ఉంటుందో తెలియదు కాబట్టి అలాంటి స్టాక్స్‌కు దూరంగా ఉంటే మంచిది.
ఐటిసి, హెచ్‌యుఎల్, ఆసియన్ పెయింట్స్ వంటి భారతీయ కన్జ్యూమర్ గుడ్స్ స్టాక్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి బిఎఫ్‌ఎస్‌ఐ స్టాక్స్ మదుపరులకు మంచి రాబడులను అందిస్తాయి’ అని ఆయన వివరించారు. మార్కెట్ సూచీలు ఒకేసారి ఏటవాలుగా పడిపోయినప్పటికీ, భారతీయ మార్కెట్ల పథం పైకే వెళ్తుందని ఆయన వివరించారు.