జాతీయ వార్తలు

మా చేరికతో అందరికీ లబ్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాష్కెంట్, జూన్ 24: షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఓ)లో భారత్ పూర్తిస్థాయి సభ్యురాలిగా చేరడం దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు అతివాదం, హింస, ఉగ్రవాద ముప్పు నుంచి ఈ ప్రాంతాన్ని రక్షించేందుకు ఉపకరిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. షాంఘై సహకార సంస్థలో భారత్ చేరిక ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో మోదీ శుక్రవారం ఎస్‌సిఓ శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగిస్తూ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. షాంఘై సహకార సంస్థలో చేరిక ద్వారా విద్యుత్, సహజ వనరుల రంగంలో భారత్‌కు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, అలాగే ఎస్‌ఓసి సభ్య దేశాల ఆర్థికాభివృద్ధికి భారత్‌లోని బలమైన ఆర్థిక వ్యవస్థ, విస్తారమైన మార్కెట్ ఊతమిస్తాయని మోదీ స్పష్టం చేశారు. ‘షాంఘై సహకార సంస్థలో భారత్ పూర్తిస్థాయి సభ్య దేశంగా చేరడం ఈ ప్రాంత ఆర్థికాభివృద్ధికి, భద్రతను మెరుగుపర్చుకునేందుకు ఉపకరించడంతో పాటు అతివాదం, హింస, ఉగ్రవాదం రూపంలో ఎదురవుతున్న సవాళ్ల నుంచి మన దేశాలను కాపాడుకునేందుకు, ఎస్‌ఓసి సభ్య దేశాలను ఏకం చేసి ఈ లక్ష్య సాధన కోసం కలసికట్టుగా కృషి చేసేందుకు, ఉగ్రవాదంపై మనమంతా ఉక్కుపాదం మోపేందుకు దోహదపడుతుంది’ అని మోదీ పేర్కొన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో షాంఘై సహకార సంస్థ విధుల పత్రం (మెమోరాండం ఆఫ్ ఆబ్లిగేషన్స్)పై భారత్ సంతకం చేయడంతో ఎస్‌ఓసిలో మన దేశాన్ని భారత్ పూర్తిస్థాయి సభ్య దేశంగా చేరే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఈ ఏడాది భారత్ మరో 30 పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. షాంఘై సహకార సంస్థలో పాకిస్తాన్‌ను కూడా పూర్తిస్థాయి సభ్య దేశంగా చేర్చుకుంటున్నారు. ఎస్‌ఓసిలో భారత్ చేరిక కోసం విస్తృత స్థాయిలో మద్దతు తెలిపిన సభ్య దేశాలు, వాటి నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, అలాగే ఎస్‌ఓసిలో పాక్ నూతన సభ్య దేశంగా చేరడాన్ని స్వాగతిస్తున్నానని మోదీ తెలిపారు.

చిత్రం... తాష్కెంట్‌లో శుక్రవారం జరిగిన షాంఘై సహకారం సంస్థ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ..ఇతర ప్రతినిధులు