జాతీయ వార్తలు

కేరళలో ‘మూడో’ కన్ను తెరుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిచూర్, డిసెంబర్ 14: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో బిజెపి అధికారంలోకి రాగలదన్న ధీమాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్న కాంగ్రెస్, సిపిఎం సారథ్యాల్లోని రెండు ఫ్రంట్‌ల ఆధిపత్యాన్ని బిజెపి అధిగమిస్తుందని, ప్రస్తుతం చాలా బలమైన శక్తిగా మూడో స్థానంలో ఉందని మోదీ తెలిపారు. ఈ మూడో శక్తిని శివుని మూడో కన్నుతో పోల్చారు. కాంగ్రెస్ సారథ్యంలోని యుడిఎఫ్, సిపిఎం సారథ్యంలోని లెఫ్ట్ ఫ్రంట్ల తప్పిదాలను ఈ మూడోకన్ను తుడిచిపెడుతుందని సోమవారం నాడిక్కడ జరిగిన బహిరంగ సభలో మోదీ తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత శివాలయం ఉన్న ఈ ప్రాంతంలోనే బిజెపిని శివుని మూడో కన్నుతో పోల్చడం ద్వారా నరేంద్ర మోదీ తమ పార్టీ రాజకీయ ప్రాబల్యాన్ని, దాన్నికున్న శక్తిని ధ్రువీకరించారు. గత కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు ఫ్రంట్లు ఒకదాని తర్వాత ఒకటి అధికారంలోకి వస్తున్నా ప్రజలకు ఏ రకమైన మేలు జరగలేదని అన్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా ఈ రెండు పార్టీలు పనిచేశాయని మోదీ పేర్కొన్నారు. ప్రతి ఐదేళ్లకోసారి ఒక ఫ్రంట్‌పై ఆగ్రహం చెందిన ప్రజలు, రెండో ఫ్రంట్ మేలు చేస్తుందన్న ఉద్దేశంతో దానికి అధికారాన్ని కట్టబడుతున్నారని, కాని దేనివల్లా ఏ రకమైన ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. ఈ రెండు కూటములు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకుని వచ్చిన అధికారాన్ని రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఉపయోగించాయని అన్నారు. ఇక నుంచి కేరళ ప్రజలు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మూడో రాజకీయ శక్తిగా ఆవిర్భవించిన బిజెపి రాష్ట్ర భవిష్యత్తుకు ధీమాను అందిస్తుందని, ఈ రెండు ఫ్రంట్ల అరాచకాలను అంతం చేస్తుందని మోదీ అన్నారు. తన బహిరంగ సభకు భారీగా హాజరైన ప్రజల నుద్దేశించి మాట్లాడిన మోదీ ‘ఇంత భారీ సంఖ్యలో ప్రజలు రావడం, నా ప్రసంగానికి హర్షధ్వానాలు పలకడం వారు రాష్ట్ర రాజకీయాల్లో మార్పును కోరుకుంటున్నారని చెప్పడానికి నిదర్శనం’ అని మోదీ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిదే అధికారమన్న నమ్మకాన్ని కూడా ఈ బహిరంగ సభ కలిగిస్తోందని తెలిపారు. సామాజిక అంతరానితనాన్ని తొలగించిన శ్రీ నారాయణ గురు వంటి ఎందరో సంఘ సంస్కర్తలు పుట్టిన గడ్డగా కేరళను అభివర్ణించారు. ఇంతటి ఘనత కలిగిన రాష్ట్రంలో రాజకీయ అంటరానితనం ఉండటం అన్నది ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. ఈ పరిస్థితి రాజకీయ ప్రత్యర్థులను, తమ సిద్ధాంతాలను విభేదించేవారిని అంతం చేయడం వరకు వెళ్లిందని తెలిపారు. ఈ రెండు ఫ్రంట్ల ఆలోచనా విధానమే ఇదని అన్నారు. గత యాభై సంవత్సరాల కాలంలో దాదాపు 200 మంది బిజెపి కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారని, అందుకు కారణం సైద్ధాంతిక విభేదాలేనని మోదీ తెలిపారు.

ఎంపెడా సభ్యునిగా ఎంపీ కంభంపాటి
ఆంధ్రభూమి బ్యూరో
న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ప్రభుత్వరంగ సంస్థలైన ఎంపెడా, సెంట్రల్ బిల్డింగ్ నిర్మాణ విభాగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఎంపీలు ఎన్నికయ్యారు. విశాఖ లోక్‌సభ సభ్యుడు కంభంపాటి హరిబాబు ఎంపెడా సభ్యునిగా ఎన్నికయ్యారు. రాజమండ్రి తెలుగుదేశం ఎంపీ మురళీమోహన్ నిర్మాణ విభాగం సభ్యునిగా ఎన్నికయ్యారు.
తారతమ్యాలు తొలగిస్తేనే సామరస్య జీవనం
రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటన
కోల్‌కతా, డిసెంబర్ 14: మైనారిటీల హక్కులను త్రికరణశుద్ధిగా పరిరక్షించాలని, వారి మనోభావాలను కంటికి రెప్పలా కాపాడాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. జాతీయ స్ఫూర్తితోనే దేశంలోని ప్రతి వర్గం హక్కులను పరిరక్షించుకోవాలని సోమవారం నాడిక్కడ ఇందిరాగాంధీ సంస్మరణ ప్రసంగంలో రాష్టప్రతి ప్రణబ్ ఉద్ఘాటించారు. దేశంలో మత అసహనం పెచ్చరిల్లుతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో రాష్టప్రతి చేసిన ఈ ప్రసంగానికి సామాజికంగానే గాక, రాజకీయంగా కూడా మరింత ప్రాధాన్యత లభించింది. కుల, మత భావాలకు అతీతంగా ప్రజలందరూ సామరస్య స్ఫూర్తితో మనుగడ సాగించాల్సిన అవసరం ఎంతో ఉందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరిలోనూ ఈ విశాల మానవీయ దృక్పథాన్ని పాదుగొల్పాలని, అలాంటి భావనలను సంతరించుకునే విధంగా విద్యాపరమైన ఔన్నతాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఆసియాటిక్ సొసైటీ నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేక అంశాలను రాష్టప్రతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. జీవన ప్రమాణాన్ని పెంపొందించాలని, అలాగే అధికారంలోనూ, సంపదలోనూ, ఆదాయం వినియోగంలోనూ పెచ్చరిల్లుతున్న తారతమ్యాలను నివారించాలని కోరారు.
విద్య, ఆరోగ్యం వంటి సామాజక సర్వీసుల వినియోగంలో అందరికీ సమాన అవకాశాలను కల్పించడం అత్యవసరమన్నారు. ఈ రకమైన ప్రాంతీయ అసమానతలను తొలగించేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని, న్యాయబద్ధమైన, నిష్పాక్షికమైన సుపరిపాలను అందించడమే ఇందుకు తగిన మార్గమని అన్నారు. చాలా సందర్భాల్లో జాతీయ ప్రయోజనాలకంటే ప్రాంతీయ ప్రయోజనాలే ప్రాధాన్యతను సంతరించుకుంటాయన్న రాష్టప్రతి ఈ రకమైన విపరిణామాల పట్ల జాగరూకతతో వ్యవహరించడం తప్పనిసరి అని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరిలోనూ లౌకిక, ప్రజాస్వామిక దృక్పథాన్ని పాదుగొల్పాలని, సమీకృత ఆలోచనా విధానాన్ని పెంపొందించాలని ఉద్ఘాటించారు. తాము జాతీయ జీవన స్రవంతిలో అవిభాజ్యమైన భాగమన్న స్పృహను ప్రతిఒక్కరిలోనూ కలిగించడం ద్వారా జాతీయ దృక్పథాన్ని బలోపేతం చేయడం సాధ్యమవుతుందని అన్నారు.