జాతీయ వార్తలు

త్వరలోనే కొత్త పీసీసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి త్వరలోనే కార్యవర్గం ఏర్పాటు చేయనున్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్లు, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచందర్‌రావు, జెడి శీలం తదితరులతో చర్చలు జరిపారు. రాష్ట్ర కాంగ్రెస్‌లోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లభించేలా కార్యవర్గం ఉంటుందని ఏఐసిసి వర్గాలు చెబుతున్నాయి. ఏపిపిసిసికి కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసిన అనంతరం రాష్ట్రంలో పెద్దఎత్తున పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ హైకమాండ్ యోచిస్తోంది.
అదనపు నియామకాలు
కాంగ్రెస్ అధిష్టానవర్గం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, సమన్వయ సంఘంలో అదనపు నియామకాలు చేసింది. సమన్వయ సంఘంలో అదనంగా నియమించటంతోపాటు పిసిసి కార్యవర్గంలో ఆరుగురు ఉపాధ్యక్షులు, తొమ్మిదిమంది ప్రధాన కార్యదర్శులను నియమించింది. దీంతోపాటు మూడు జిల్లా, నగర కాంగ్రెస్ కమిటీలకు అధ్యక్షులను నియమించినట్లు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమన్వయ కమిటీలో సివి శేషారెడ్డిని సభ్యుడిగా నియమించటంతోపాటు పిసిసి ఉపాధ్యక్షులంతా సమన్వయ సంఘ సభ్యులుగా వ్యవహరిస్తారని హైకమాండ్ ప్రకటించింది. ఇదిలావుంటే మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, దేవకుమార్ రెడ్డి, ఎం సూర్యనాయక్, ఎన్ తులసిరెడ్డి, విశ్వప్రసాద్, ఎం రత్నకుమార్‌లను పిసిసి ఉపాధ్యక్షులుగా నియమించింది. ఆర్ స్వామినాయుడు, షేక్ మస్తాన్ వలీ, చందలబాబు యాదవ్, ఎస్ శాంతిభూషణ్, రవి చంద్రారెడ్డి, మిర్యాల వెంకట శివ రామ కృష్ణ, ఎస్‌ఎ సత్తార్, జయరాం బాబు, మీసాల రాజేశ్వర రావులను పిసిసి అదనపు ప్రధాన కార్యదర్శులుగా నియమించింది. డిసిసి, నెల్లూరు డిసిసి అధ్యక్షుడిగా పనబాక కృష్ణయ్య, నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా యు వెంకటరావు యాదవ్, ముత్యాల రావులను నియమించినట్లు జనార్దన్ ద్వివేదీ తమ ప్రకటనలో తెలిపారు.