జాతీయ వార్తలు

12లక్షలు కడితే సొంత బొమ్మతో స్టాంప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూన్ 29: తపాలా బిళ్లళపై మీ ఫొటోను లేదా మీ కంపెనీ లోగోను చూసుకోవాలని ఉందా? కేవలం పనె్నండు లక్షలు కడితే చాలు మీ బొమ్మ లేదా మీ కంపెనీ లోగోతో తపాలా బిళ్ల జారీ అవుతుంది. వ్యక్తిగత, కంపెనీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘మై స్టాంప్’పేరుతో ఈ తపాలా బిళ్లలను జారీ చేయాలని నిర్ణయించామని పోస్టల్ విభాగం తెలిపింది. పనె్నండు లక్షలు కడితే 60వేల స్టాంపులు లభిస్తాయని తపాలా విభాగం కార్యదర్శి ఎస్‌కె సిన్హా వెల్లడించారు. ఈ స్టాంపులను మామూలు పోస్టల్ మెయిల్స్‌కు ఉపయోగించుకోవచ్చునని తెలిపారు. అయితే పనె్నండు లక్షలు కట్టినంత మాత్రాన అందరికీ వీటిని జారీ చేసే అవకాశం లేదని, వారి గతాన్ని కూడా క్షుణ్ణంగా పరిగణనలోకి తీసుకునే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మై స్టాంప్ జారీ ద్వారా దాదాపు 60వేల కోట్ల రూపాయల మేర ఆదాయం లభించగలదని ఆశిస్తున్నామన్నారు.