జాతీయ వార్తలు

వాయుసేనలోకి ‘తేజాస్’ యుద్ధ విమానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 1: స్వదేశీ యుద్ధ విమానం ‘తేజాస్’ శుక్రవారం భారత వైమానిక దళంలో చేరింది. ఈ తేలిక పాటి పోరాట విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) అభివృద్ధి చేసింది. బెంగళూరులోని హెచ్‌ఏఎల్ వైమానిక శిక్షణా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో వైమానిక దళం దక్షిణ విభాగం అధిపతి జస్బీర్ వాలియా సమక్షంలో రెండు తేజాస్ విమానాలను హెచ్‌ఏఎల్ వైమానిక దళానికి అప్పగించింది. హెచ్‌ఏఎల్‌కు చెందిన పలువురు అధికారులు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కమాండర్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ మాధవ్ రంగాచారి నడిపిన ఒక తేజాస్ యుద్ధ విమానం గగన తలంలో చక్కర్లు కొట్టింది. విమానాల అప్పగింత కార్యక్రమానికి ముందు సర్వమత ప్రార్థనలు జరిగాయి. స్క్వాడ్రన్ 45 ఫ్లయింగ్ డ్రాగన్స్ దళంలోకి ఈ విమానాలు చేరాయి.
స్వదేశీ యుద్ధ విమానాన్ని త యారు చేయాలన్న ఆలోచన వచ్చి న దాదాపు నాలుగు దశాబ్దాలకు ఆ కల నిజమైంది. 1970లోనే ఈ ప్రా జెక్టు ఆలోచన వచ్చినప్పటికీ వాస్తవానికి 1980లో మాత్రమే పని ప్రారంభమైంది. 2001 జనవరిలో మొట్టమొదటిసారిగా ఈ యుద్ధ విమానాన్ని నడిపి పరీక్షించడం జరిగింది. గత జనవరిలో భారత వైమానిక దళం ప్రధానాధికారి ఎయిర్‌చీప్ మార్షల్ అరూప్ రాహా తొలిసారిగా తేజాస్ యుద్ధ విమానాన్ని నడిపిన తర్వాత వైమానిక దళంలో చేరడానికి అది అన్ని విధాలుగా తగినదని సర్టిఫై చేశారు. హెచ్‌ఏఎల్ ఈ ఆర్థిక సంవత్సరం ఆరు, వచ్చే ఏడాది మరో ఎనిమిది విమానాలను అప్పగించనుంది. వయసు పైబడిన మిగ్-21 యుద్ధ విమానాల స్థానంలో ఈ తేజాస్ విమానాలను చేర్చుకోవాలని వైమానిక దళం యోచిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది రెండు మిగ్-21 స్క్వాడ్రన్‌లను రద్దుచేసి వాటి స్థానంలో తేజాస్ స్క్వాడ్రన్‌లను ఏర్పాటు చేయనున్నట్లు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఈ నెల ప్రారంభంలో చెప్పారు. ఒక్కో స్క్వాడ్రన్‌లో నాలుగు రిజర్వ్ విమానాలతో కలుపుకొని 20 తేజాస్ విమానాలు ఉంటాయి. తొలి స్క్వాడ్రన్ రెండేళ్ల పాటు బెంగళూరులో ఉంటుంది. ఆ తర్వాత తమిళనాడులోని సూలూరుకు తరలిస్తారు.
ప్రధాని హర్షం
కాగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి తేలిక పాటి యుద్ధ విమానం తేజాస్‌ను భారత వైమానిక దళంలో చేరడం దేశమంతా గర్వించదగ్గ, సంతోషించదగ్గ క్షణమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అంతేకాకుండా ఇది భారతీయ శాస్తవ్రేత్తల నైపుణ్యం, సామర్థ్యానికి నిదర్శనమని ఆయన ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

చిత్రం... బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌లో శుక్రవారం వైమానిక దళంలోకి
చేరిన తర్వాత గగన తలంలో విహరిస్తున్న తేజాస్ యుద్ధ విమానం