జాతీయ వార్తలు

కమిటీపై కయ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: తెలంగాణ కాంగ్రెస్‌కు కార్యవర్గం ఏర్పాటుపై బేధాదాభిప్రాయాలు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మంగళవారం తెలంగాణ నేతలతో పార్లమెంట్ ఆవరణలో జరిగిన చర్చల్లో భేదాభిప్రాయాలు బహిర్గతమయ్యాయి. త్వరలోనే జిహెచ్‌ఎంసి ఎన్నికలు జరగాల్సి ఉన్నందున పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలంటే పిసిసికి వెంటనే కార్యవర్గం ఏర్పాటు చేయాలని పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, పాల్వాయి గోవర్దన్ రెడ్డి కార్యవర్గం ఏర్పాటును గట్టిగా వ్యతిరేకించినట్టు తెలిసింది. ఉత్తమ్‌కుమార్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమించి తొమ్మిది నెలలు కావస్తున్నా కార్యవర్గం ఏర్పాటు చేయకపోవటం వలన పార్టీకి ఎంతో నష్టం కలిగిందని భట్టి విక్రమార్క వాదించారు. జిహెచ్‌ఎంసికి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. పార్టీ అభ్యర్థుల ఎంపిక గురించి చర్చిస్తున్నాం. కానీ కిందిస్థాయిలో పార్టీ తరఫున పని చేసేందుకు కార్యకర్తలు లేరని హైకమాండ్‌కు భట్టి స్పష్టం చేశారు. పిసిసికి కొత్త కార్యవర్గం ఏర్పాటు చేయటంతోపాటు గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో దాదాపు 50మంది కాంగ్రెస్ కార్యకర్తలతో కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇలా చేయటం వలన జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి పని చేసేందుకు అవసరమైన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని ఆయన వివరించినట్టు సమాచారం. భట్టి విక్రమార్క ప్రతిపాదనను పలువురు సీనియర్లు బలపర్చగా, విహెచ్, పాల్వాయి తదితరులు గట్టిగా వ్యతిరేకించారు. పిసిసికి కార్యవర్గం ఏర్పాటు చేయకపోవటం ద్వారా ఇప్పటికే చాలామంది నేతలు, శ్రేణులను కోల్పోయాం. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు జరగాల్సిన తరుణంలో కొత్త కార్యవర్గం ఏర్పాటు చేస్తే, పదవులు లభించని వారంతా పార్టీకి రాజీనామా చేసి తెరాస తదితర పార్టీల గూటికిపోయే ప్రమాదం ఉందని విహెచ్, పాల్వాయి హెచ్చరించారు. పిసిసి కార్యవర్గాన్ని మొదట్లోనే ఏర్పాటుచేస్తే బాగుండేదని, ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల తరుణంలో కార్యవర్గం ఏర్పాటుచేసి పార్టీలో అసంతృప్తిని రెచ్చగొడతారా? అని విహెచ్ ప్రశ్నించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణకు కమిటీ ఏర్పాటు చేసే బదులు, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ సలహా కమిటీ ఏర్పాటు మంచిదని సూచించినట్టు తెలిసింది. గ్రేటర్ ఎన్నికల కోసం నియోజకవర్గ స్థాయిలో 50మంది కార్యకర్తలతో కమిటీలు వేయాలన్న భట్టి ప్రతిపాదనను మెజారిటీ నేతలు సమర్థించటంతో, ఈనెల 28 తేదీలోగా వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పునరుజ్జీవింపజేసేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించిన ఒక పత్రాన్ని గోవర్దన్ రెడ్డి ప్రధాన కార్యదర్శికి అందజేసినట్టు తెలిసింది. ఇదిలావుంటే, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు చేసే అంశంపై దిగ్విజయ్ సింగ్ మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్‌కు నేతలతో సంప్రదింపులు జరిపారు. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు కె జానారెడ్డి, శాసన మండలిలో పార్టీపక్ష నాయకుడు షబ్బీర్ అలీతో ఆయన విడిగా చర్చలు జరిపారు. కార్యవర్గం ఏర్పాటుపై సీనియర్ల అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షడు రాహుల్ గాంధీకి పరిస్థితి వివరించిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటారు.