జాతీయ వార్తలు

వైభవంగా రథయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

..............
ఓ పక్క భక్త జన పారవశ్యం. మరోపక్క రెప్పవాల్చని నిఘా మధ్య పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర అట్టహాసంగా సాగింది. ప్రపంచ ప్రసిద్ధమైన ఈ యాత్రను తిలకించేందుకు 9 లక్షల మంది భక్తులు తరలివచ్చినట్టు అంచనా. జగన్నాథ సమేత బలభద్రుడు, సుభద్ర మూలమూర్తులను గుండిచా ఆలయానికి తీసుకెళ్లే ఈ యాత్ర ప్రతి ఒక్కరికీ అనిర్వచనీయ అనుభూతిమే అందించింది. జగన్నాథ ఆలయం నుంచి గుండిచా ఆలయానికి రథయాత్ర చేరుకున్న తరువాత మొత్తం తొమ్మిది రోజులపాటు అక్కడే విగ్రహాలకు పూజలు నిర్వహిస్తారు.
.............

పూరీ, జూలై 6: ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధమైన జగన్నాథ రథయాత్రను తిలకించేందుకు ఒడిశాలో పుణ్యక్షేత్రమైన పూరీకి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా జగన్నాథ రథ యాత్రను చూసేందుకు తండోపతండాలుగా భక్తుల రావడంతో భారీఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. జగన్నాథ ఆలయం నుంచి గుండిచా ఆలయానికి యాత్ర మొదలైంది. మొత్తం తొమ్మిది రోజులపాటు అక్కడే ఈ విగ్రహాలకు పూజలు జరుగుతాయి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవీల యాత్రలకు బుధవారం తొలిరోజు కావడంతో సర్వత్రా జగన్నాథ నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. మంగళవారం నుంచే ఆలయ ప్రాంతానికి వేల సంఖ్యలోనే భక్తుల తాకిడి మొదలైంది. ఉరకలేసే ఉత్సాహంతో, భక్తి పారవశ్యంతో ఈ యాత్రలో లక్షలాదిగా పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తావులేకుండా చూసేందుకు భద్రతాపరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని పోలీసులు అధికారులు తెలిపారు. అన్నిచోట్లా సిసిటివిలను ఏర్పాటు చేశామన్నారు. ఆలయం వెలుపల అలాగే మూడు రథాల చుట్టూ పూర్తిస్థాయిలో రక్షణ కల్పించామని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని డిజిపి కెబి సింగ్ తెలిపారు. నిఘాతోపాటు అన్నిచోట్లా గస్తీని ముమ్మరం చేశామని, అలాగే లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నందున తొక్కిసలాటకు జరిగేందుకు ఎలాంటి ఆస్కారం లేకుండా గట్టి ఏర్పాట్లు చేశామన్నారు. 12వ శతాబ్దం నాటి జగన్నాథ ఆలయ రథయాత్రకు ఏటేటా భక్తజన సందోహం పెరుగుతూనే ఉంది. ఈసారి మరింతగా భక్తుల రాక పెరగడంతో భద్రతపరంగానూ ప్రత్యేక చర్యలు చేపట్టారు.