జాతీయ వార్తలు

అమరావతి చుట్టూ సర్క్యులర్ రైల్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,డిసెంబర్ 15:ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్డూ సర్క్యులర్ రైల్వే సదుపాయాన్ని కల్పించవలసిందిగా గుంటూరు తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మంత్రిని కలిసి ఈ విషయంపై చర్చించారు. అమరావతిని చేరుకోవటానికి వివిధ ప్రాంతాల నుంచి రైలు సదుపాయాలను మెరుగుపరచవలసిన అవసరంపై ఆయన వివరించారు. అమరావతి చుట్టూ సర్క్యులర్ రైలు లైనును నిర్మించిన పక్షంలో రవాణా సదుపాయాలు మెరుగుపడతాయని,రైల్వే సదుపాయాలను మెరుగుపరచే చర్యలలోభాగంగా గుంటూ రు,మంగళగిరి, తెనాలి స్టేషన్లలను ఆధునికీకరించాలని కోరారు. అనకాపల్లి లోక్‌సభ సభ్యుడు ముత్తం శెట్టి శ్రీనివాస్ రైల్వే మంత్రికి అందచేసిన వినతి పత్రంలో నాందేడ్ -విశాఖ, అమరావతి,హౌరా యశ్వంత్‌పూర్, విశాఖ- కొల్లం,కోరమాండల్ సూపర్ ఫాస్టు రైళ్లను అనకాపల్లి స్టేసన్‌లో నిలపాల్సిందిగా కోరారు. ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ=సామర్లకోట మధ్య ఒక పాసింజర్ రైలును ప్రారంభించాలని కోరారు విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న జన్మభూమి, విశాఖ-విజయవాడ మధ్య నడిచే రత్నాచల్‌ను యలమంచిలోఆపాలని సూచించారు.
చెరకు మద్దతు ధరను 3వేలకు పెంచండి
ఆంధ్రభూమిబ్యూరో
న్యూఢిల్లీడిసెంబర్ 15:చెరకు కనీస మద్దతు ధరను ఇప్పుడున్న రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలకు పెంచి రైతాంగాన్ని ఆదుకోవలసిందిగా అనకాపల్లి తెలుగుదేశం ఎంపీ ముత్తం శెట్టి శ్రీనివాసరావుకేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పెరిగిపోతున్న ఉత్పత్తి ఖర్చుకు అనుగుణంగా కనీస మద్దతు ధరను పెంచాల్సిన అవసరం ఉందని ఆయన లోక్‌సభలో చెరుకు సవరణ బిల్లుపై ప్రసంగిస్తూ చెప్పారు. రైతులకు ఎనిమిది గంటల సేపు అంతరాయం లేకుండా కరెంటును అందచేయాలని సూచించారు. చెరకు పండించటంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు ఎప్పడికప్పుడు అవగాహన కల్పించటానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

‘కాల్‌మనీ’పై ఏపీ సర్కార్‌కు
ఎన్‌హెచ్‌ఆర్‌సి నోటీసులు

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: మధ్యతరగతి పేద కుటుంబాలను వీధుల పాలుచేసిన, మహిళలను వ్యభిచార కూపంలోకి దించుతున్న కాల్‌మనీ దురాగతాలపై జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. విజయవాడలో వెలుగు చూసిన ఈ దురాగతంపై తీసుకున్న చర్యలను వివరిస్తూ రెండు వారాల్లోగా సమగ్రమైన నివేదికను సమర్పించవలసిందిగా జాతీయ మానవ హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపిని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యులు టి.సుబ్బరామిరెడ్డి, కెవిపి రామచంద్రరావు, జెడి శీలం, జైరామ్ రమేష్, సుంకర పద్మశ్రీ అందచేసిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఆ ఆదేశాలు జారీ చేసింది. సంఘం సభ్యుడు జస్టిస్ మురుగేషన్ విజయవాడలో వెలుగుచూసిన కాల్‌మనీ వ్యవహారం సభ్యసమాజానికే సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. మహిళలను వ్యభిచారంలోకి దించడం అత్యంత కిరాతకమైన చర్యగా ఆయన వ్యాఖ్యానించారు. బాకీ చెల్లించకపోతే మహిళలను, బాలికలను వ్యభిచారానికి దించడం మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని మురుగేషన్ అన్నారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని ఉపేక్షించరాదని ఆయన ఆదేశించారు.