జాతీయ వార్తలు

ప్రధానిపై బురదజల్లడం అలవాటైపోయింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మంగళవారం మరోసారి అసభ్యకరమైన పదజాలంతో ప్రధాని మోదీని విమర్శించి సరికొత్త వివాదానికి తెరతీశారు. తన కార్యాలయం, ముఖ్య కార్యదర్శి నివాస గృహంపై సిబిఐ సోదాలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని పిరికిపంద అని, సైకో అని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలపై బిజెపి ఘాటుగా స్పందించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ప్రతిదానికి ప్రధాని మోదీని విమర్శించి బురద జల్లటం కేజ్రీవాల్‌కు అలవాటై పోయిందని అన్నారు. సిబిఐ ప్రభుత్వ అధీనంలో పని చేయదు. యుపిఏ దుర్వినియోగం చేసినట్లు సిబిఐని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించే అలవాటు ఎన్డీయే ప్రభుత్వానికి లేదని ఆయన విలేఖరులకు చెప్పారు. ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కచ్చితమైన సాక్ష్యాధారాలు లభించిన తరువాత సంబంధిత న్యాయస్థానం అనుమతి పొంది సిబిఐ ఢిల్లీ సిఎం ముఖ్య కార్యదర్శి నివాసం, కార్యాలయంపై సిబిఐ సోదాలు నిర్వహించిందని ఆయన చెప్పారు. ప్రధాని వ్యక్తిత్వం, పదవికి ఉన్న ఔన్నత్యాన్ని గుర్తించకుండా కేజ్రీవాల్ నోరుజారి ఘోరమైన తప్పిదం చేశారని వెంకయ్య విమర్శించారు.
కేంద్ర టెలికమ్ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మతిభ్రమించి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్య కార్యదర్శిని నియమించుకునే ముందు అతని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవలసిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని చెబుతూ, ఈ కనీస బాధ్యతను నిర్వర్తించకుండా కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శిని నియమించుకుని నియమ నిబంధనలకు పాతర వేశారని విమర్శంచారు. మోదీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధించటానికి సిబిఐని అయుధంగా వాడుతోందని కేజ్రీవాల్ చేసిన ఆరోపణ ఎంతమాత్రం నిజం కాదని ఆయన చెప్పారు. సిబిఐ పనిలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఆయన చెప్పారు. అవినీతికి పాల్పడినట్లు కచ్చితమైన ఆధారాలు లభించిన తరువాతే సిబిఐఐ ఈ సోదాలు చేసిందని ఆయన చెప్పారు. అవినీతికి పాల్పడిన అధికారులను తన కొలువలో నియమించుకుని నీతులు వల్లించటం మానివేయవలసిందిగా ఆయన కేజ్రీవాల్‌కు సలహా ఇచ్చారు.

జంట హత్యల కేసులో
మరో మగ్గురు అరెస్టు

ముంబయి, డిసెంబర్ 15: ప్రముఖ చిత్రకారిణి హేమా ఉపాధ్యాయ, ఆమె లాయర్ హరీశ్ భంభానీల హత్య కేసులో మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నాలుగో నిందితుడిని వారణాసిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు నగరానికి తీసుకురానున్నారు. అతడిని త్వరలోనే కోర్టులో హాజరుపరచనున్నట్టు వెల్లడించారు. ఆజాద్ రాజభర్, ప్రదీప్ రాజ్‌భర్, వికాస్ రాజ్‌భర్‌లను ముంబయి పోలీసులు అరెస్టు చేసినట్టు డిప్యూటీ పోలీసు కమిషనర్ విక్రమ్ దేశ్‌మనే తెలిపారు.
హేమా ఆమె భర్త చింతన్ ఉపాధ్యాయ వేసే చిత్రాల ఫైబర్ గ్లాసులను వీరే తీసుకెళ్లి విక్రయిస్తుండేవారని ఆయన చెప్పారు. ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరచగా ఈనెల 19 వరకూ రిమాండ్ విధించారు. ప్రముఖ చిత్రకారిణి హేమా ఉపాధ్యాయ(43), ఆమె లాయర్ హరీశ్ భంభానీ(65) మృతదేహాలను కార్డుబోర్డు పెట్టేల్లో ఉంచి కండివలీలోని డ్రెయిన్లో పడేశారు. శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శివకుమార్ రాజ్‌భర్ అలియాస్ సాధును వారణాసిలో సోమవారం అదుపులోకి తీసుకున్నారు. టాన్సిట్ రిమాండ్‌లో ఉన్న సాధును ముంబయికి తీసుకొస్తున్నట్టు డిసి చెప్పారు. కేసు దర్యాప్తులో ఉన్నందున ఇంతకు మించి వివరాలు వెల్లడించలేమని ఆయన అన్నారు. తాము అదుపులోకి తీసుకున్న నిందితులు అందించిన సమాచారం మేరకు మహారాష్టయ్రేతర ప్రాంతానికి ప్రత్యేక బృందాలను పంపినట్టు విక్రమ్ దేశ్‌మనె వెల్లడించారు. కీలక నిందితుడు విద్యాధర్ రాజ్‌భర్ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.