జాతీయ వార్తలు

ప్రణబ్ ప్రధాని అయి ఉంటే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: మన్మోహన్ సింగ్ స్థానే ప్రణబ్ ముఖర్జీని 2004లో ప్రధాన మంత్రిని చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుత దుస్థితి తప్పి ఉండేదని గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఫలితాలు భిన్నంగా ఉండేవని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రం మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తన తాజా పుస్తకంలో పేర్కొన్నారు. ప్రణబ్‌ను కాకుండా మన్మోహన్ సింగ్‌ను ప్రధాని పదవికి ఎంపిక చేయడం కాంగ్రెస్ వర్గాల్లోనే కాకుండా ఇతరుల్లో కూడా ఆశ్చర్యాన్ని కలిగించిందని వెల్లడించారు. అయితే ఏదయినా తప్పు జరిగిన తర్వాత అలా చేసి ఉండకపోయి ఉంటే బాగుండేదని అనడం చాలా సులభమని, పివి నరసింహారావు ప్రభుత్వంలో దేశ గతినే మార్చివేసిన ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్‌ను మొత్తం దేశం ప్రశంసించిన విషయాన్ని మనం మరిచిపోకూడదని ఆయన అన్నారు. అయితే 1999 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యంత సురక్షితమైన స్థానంగా భావించిన దక్షిణ ఢిల్లీ లోక్‌సభ స్థానంనుంచి మన్మోహన్ పోటీ చేసినప్పుడు చాలామంది పేరు కూడా ఎత్తడానికి భయపడే అభ్యర్థి (బిజెపికి చెందిన ప్రొఫెర్ వికె మల్హోత్రా) చేతిలో ఓడిపోయారని ఖుర్షీద్ ‘ది అదర్ సైడ్ ఆఫ్ వౌంటైన్’ పేరుతో తాను రాస్తున్న కొత్త పుస్తకంలో అన్నారు.
అయితే మొదట్లో కాస్త అయిష్టంగానే అంగీకరించినప్పటికీ మన్మోహన్‌ను ప్రధానిని చేయాలన్న సోనియా గాంధీ నిర్ణయాన్ని అందరూ స్వాగతించడమే కాక, అయిదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో తాము తిరిగి అధికారంలోకి రావడంతో ఆ నిర్ణయం సరయినదేనని రుజువయిందని యుపిఏ-2 ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పని చేసిన ఖుర్షీద్ అన్నారు. అప్పటి ప్రధానమంత్రి విశ్వాసాన్ని చూరగొనడం తన అదృష్టమని, కేవలం ఒక్కసారి మాత్రం అఫ్గానిస్థాన్‌కు భారత్ పదునైన ఆయుధాలను సమకూర్చలేదని మీడియా సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలకుగాను సుతిమెత్తగా మందలించారని ఖుర్షీద్ అన్నారు. తన పుస్తకం కేవలం ఒక వ్యక్తికి సంబంధించినది కాదని, యుపిఏ ప్రభుత్వంలో భాగంగా ఉన్న చాలామంది జీవితాలకు సంబంధించినదని కూడా ఆయన అంటున్నారు.