జాతీయ వార్తలు

ఉగ్రవాదంపై ఉపేక్ష వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని తుడిచిపెట్టాలని, నిస్సహన వైఖరితో తరిమికొట్టాలని భారత లోక్‌సభ మంగళవారం ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఉగ్రవాద మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో ఎవరికి వారుగా కాకుండా ఉమ్మడి వ్యూహంతో సంఘటితంగామే ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు ఘన నివాళులర్పించింది. బీహార్‌లో సోమవారం నక్సల్స్ జరిపిన దాడిలో పదిమంది సిఆర్‌పిఎఫ్ కమెండోలు మరణించడం పట్ల కూడా లోక్‌సభ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఔరంగాబాద్ అటవీ ప్రాంతంలో నక్సలైట్లు పేల్చిన మందుపాతరకు కోబ్రా కమెండోలు బలైన సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని రేకెత్తించింది. ప్రపంచ శాంతికి గొడ్డలి పెట్టుగా పరిణమించిన ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిందేనని, ప్రపంచంలో దీని ఛాయలే లేకుండా చేయాల్సిన అవసరం ఎంతో ఉందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, సౌదీ అరేబియా తదితర దేశాల్లో జరిగిన భయానక ఉగ్రవాద దాడుల్ని లోక్‌సభ ముక్తకంఠంతో ఖండించిందని తెలిపారు. ఎలాంటి రాజీకి తావులేకుండా మొత్తం ప్రపంచం ఒక్కతాటిపై నడిచి ఉగ్రవాదాన్ని దునుమాడాల్సిన అవసరాన్ని ఈ దాడులు మరింతగా స్పష్టం చేస్తున్నాయన్నారు. టర్కీలోని ఇస్తాంబుల్ విమానాశ్రయంలో, ఇటీవల ఢాకాలోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల్ని కూడా లోక్‌సభ సభ్యులు తీవ్ర స్వరంతో ఖండించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం చేపట్టే చర్యలకు భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈ సందర్భంగా వెల్లడించారు. దాడుల్లో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ లోక్‌సభ సభ్యులు కొద్ది సేపు వౌనం పాటించారు.

చిత్రం... సభలో మాట్లాడుతున్న
హోం మంత్రి రాజ్‌నాథ్