జాతీయ వార్తలు

దళితులను ఏరేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: గుజరాత్‌లో గోసంరక్షణ పేరుతో దళితులపై జరిగిన దాడులపై బుధవారం లోక్‌సభ అట్టుడికిపోయింది. దళితముక్త్ భారత్ చేసేందుకు అధికార బిజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్‌సంఘ్‌లు కుట్ర చేస్తున్నాయని ప్రధాన విపక్షం కాంగ్రెస్ సహా అన్ని విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. అయితే ప్రభుత్వం నుంచి కూడా అంతే తీవ్రంగా ప్రతిస్పందన వచ్చింది. దేశాన్ని కాంగ్రెస్ పాలించిన కాలంలోనే దళితులపై వేధింపుల లెక్కలను ఏకరవు పెట్టింది. జూలై 11న గుజరాత్‌లోని ఉనాలో చనిపోయిన ఓ ఆవు చర్మాన్ని ఒలుస్తున్న నలుగురు దళిత యువకులను స్థానిక గోరక్షక దళ యువకులు తీవ్రంగా కొట్టి, కారుకు కట్టేసి ఊరంతా అర్ధనగ్నంగా ఊరేగించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా దీనికి సంబంధించిన వీడియోను ఒక హెచ్చరికగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయటం వల్ల వివాదం దేశమంతా విస్తృతంగా వ్యాపించింది. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ సభ్యుడు సురేశ్ ప్రస్తావించారు. దీనిపై సంయుక్తపార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సభ్యులంతా వెల్‌లోకి దూసుకెళ్లి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ‘‘హింస అనేది ఆరెస్సెస్ అజెండా, దళిత ముక్త్ భారత్ చేసేందుకు ఆరెస్సెస్ ప్రయత్నిస్తోంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇది బీజేపీ ప్రేరిత దాడి. దేశంలో ఏం జరుగుతోంది? ఇదేనా గుజరాత్ మోడల్ అంటే?’’ అని సురేశ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యులకు దీటుగా అధికార బీజేపీ సభ్యులు కూడా తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు మందు కులాల మధ్య విభేదాలకు బీజేపీ ప్రయత్నిస్తోందని సురేశ్ ఆరోపించారు. దీనికి సమాధానమిచ్చిన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ ఈ ఘటనను ఖండించారు. గుజరాత్‌లో ఆనందిబెన్ పటేల్ ప్రభుత్వం దీనిపై కఠిన చర్యలు తీసుకుంటోందని, తొమ్మిది మందిని అరెస్టు చేసి ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరిపిస్తోందని ఆయన అన్నారు. బాధితులకు తగిన వైద్య సహాయాన్ని కూడా అందిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్‌లోనే కాదు.. దేశంలో ఎక్కడ దళితులపై దాడులు జరిగినా ఉపేక్షించేది లేదదని హోం మంత్రి స్పష్టం చేశారు. దళితులపై దాడులనేవి ఒక సామాజిక రుగ్మత అని, దీన్ని నిర్మూలించేందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకు ముందు కాంగ్రెస్ నేత సురేశ్ మాట్లాడుతూ దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితి ఉందని ఆరోపించారు. గుజరాత్‌లో చాలామంది దళితులు ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించారని కూడా ఆయన అన్నారు.
chitram...
1. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుల ఆందోళన

2. దళితుల అంశంపై సభలో మాట్లాడుతున్న మంత్రి రాజ్‌నాథ్