జాతీయ వార్తలు

నియమావళి రూపొందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను నియమించే కొలీజియం విధానాన్ని మరింత పారదర్శకం, జవాబుదారీతో కూడినదిగా చేయడం కోసం బుధవారం పలు సూచనలు చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి విధి విధానాల మెమోరాండంను (ఎంఓపి) ఖరారు చేయాలని కేంద్రానికి సూచించింది. ప్రధానంగా అయిదు అంశాలు- అర్హతా ప్రమాణాలు, నియామక ప్రక్రియలో పారదర్శకత, ఎంపిక ప్రక్రియ నిర్వహణ కోసం ఒక సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేయడం, జడ్జీలుగా నియమించడం కోసం పరిశీలిస్తున్న వారిపై వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఇతర అంశాలను పరిశీలించడం అనే అంశాలను పరిశీలించాలని జస్టిస్ జెఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి కేంద్రం విధి విదానాల మెమోరాండంను ఖరారు చేయవచ్చని న్యాయమూర్తులు జె చలమేశ్వర్, మదన్ బి లోకుర్, కురియన్ జోసెఫ్, ఆదర్శ్ కుమార్ గోయల్‌లు కూడా ఉన్న బెంచ్ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న ఎంఓపికి అనుబంధాలను చేర్చడం ద్వారా దాన్ని ఖరారు చేయవచ్చని, కొలీజియంలోని నలుగురు సీనియర్ మోస్ట్ న్యాయమూర్తుల ఏకాభిప్రాయం ఆధారంగా ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసువచ్చని బెంచ్ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం (ఏదయితే అది) సలహాలు కోరి, వాటిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం పైన పేర్కొన్న అయిదు ప్రధాన అంశాలను విధి విధానాల మెమోరాండంలో చేర్చాలని బెంచ్ పేర్కొంది. న్యాయమూర్తుల నియమాకాల్లో పారదర్శకత ఉండేలా చూడడం కోసం ఎంఓపిలో వివరంగా పేర్కొన్న అర్హతా ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ నిబంధనలను సంబంధిత కోర్టు వెబ్‌సైట్‌లో, అలాగే భారత ప్రభుత్వ న్యాయ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లోను ఉంచాలని కూడా బెంచ్ స్పష్టం చేసింది.