జాతీయ వార్తలు

16 ఏళ్ల తరువాత...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్, జూలై 26: ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ చాను షర్మిల(44) తన 16 సంవత్సరాల సుదీర్ఘ నిరాహార దీక్షను విరమించటానికి నిర్ణయించుకున్నారు. ఆత్మహత్యాయత్నం కేసులో జైలులో ఉన్న ఆగస్టు 9న దీక్ష విరమించటానికి నిర్ణయించుకున్నట్లు స్థానిక కోర్టులో హాజరవటానికి మంగళవారం వచ్చిన సందర్భంగా తెలిపారు. ‘నేను దీక్ష విరమిస్తాను. రాజకీయాల్లో చేరుతున్నాను. మణిపూర్ అసెంబ్లీకి త్వరలో జరగబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తాను’ అని షర్మిల వివరించారు. ఆగస్టు 9న జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత వివాహం చేసుకోవటానికి కూడా షర్మిల సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. భారత సంతతికి చెందిన ఓ బ్రిటిష్ జాతీయుడు ఆమెకు బాయ్‌ఫ్రెండ్‌గా ఉన్నట్లు సమాచారం. భద్రతా బలగాలకు ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్‌పిఏ)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2000 సంవత్సరం నవంబర్‌లో షర్మిల(42) నిరాహార దీక్ష చేపట్టారు. అస్సాం రైఫిల్స్ దళాల చేతిలో 10మంది మణిపురి ప్రజలు చనిపోవటంతో ఆమె దీక్ష ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ఆహారం తీసుకోకుండా, నీరు కూడా తాగకుండా ఆమె దీక్ష చేస్తున్నారు. వైద్యులు ఆమెకు బలవంతంగా అందిస్తున్న ఫ్లూయిడ్స్‌పైనే ఆమె జీవిస్తున్నారు. ఆమెను చాలాసార్లు పోలీసులు అరెస్టు చేసి వదిలేశారు. ఆమెపై ఆత్మహత్యాయత్నం కేసు (309)ను నమోదు చేశారు. తనపై అభియోగాన్ని ఖండించినా, ఎఎఫ్‌ఎస్‌పిఏను రద్దు చేయాలన్న డిమాండ్‌పై తన దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేయాల్సిందిగా ఆమ్ ఆద్మీపార్టీ నుంచి వచ్చిన ప్రతిపాదనను షర్మిల తిరస్కరించారు. ఆ తరువాత కూడా పలు పార్టీలు ఆమె ముందు అవకాశాలనుంచినా ఆమె తిరస్కరిస్తూ వచ్చారు.