జాతీయ వార్తలు

బెయల్ తీసుకోరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు బెయిలుకోసం దరఖాస్తు చేసుకోకపోవచ్చంటూఓ వైపు పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో ఆ ఇద్దరూ శనివారం ఢిల్లీ కోర్టు ఎదుట హాజరవనున్నాన్నారు. శనివారం మధ్యాహ్నం ఇరువురు నేతలు కోర్టులో హాజరయినప్పుడు వారు అనుసరించబోయే వ్యూహం ఏమిటనే దానిపై పార్టీ వర్గాలు ఏమాత్రం పెదవి విప్పడం లేదు. నిబంధనల ప్రకారం కోర్టులో హాజరు కావలసిందిగా నిందితుడికి సమన్లు జారీ చేసినప్పుడు అతను లేదా ఆమె కోర్టులో హాజరయి బెయిలు కోరితే కోర్టు బెయిలు మంజూరు చేస్తుంది. లేదంటే వారిని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకుంటారు. ఒక వేళ నిందితులు బెయిలుకోసం దరఖాస్తు చేసుకోకపోతే కోర్టు వారిని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకుంటుంది. కాగా, తాము న్యాయప్రక్రియను గౌరవిస్తామని, దాని ప్రకారమే నడుచుకుంటామని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఉపాధ్యక్షుడికి న్యాయ ప్రక్రియపై పూర్తి విశ్వాసం ఉందన్న ఆయన న్యాయవాదుల సలహా మేరకు వారు నడుచుకుంటారని తెలిపారు. కాగా, సోనియా, రాహుల్‌లు బెయిలుకోసం దరఖాస్తు చేసుకుంటారా లేదా అని విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఈ కేసులో వారి తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేసారు. ‘మా వ్యూహం ఏమిటో మీడియాకు చెప్పలేము. ఈ అంశంపై నేను ఎవరితోను మాట్లాడలేదు. దీనిపై నేను ఏమీ మాట్లాడలేను’ అని ఆయన అన్నారు. కాగా, శనివారం సోనియా, రాహుల్‌లు కోర్టుకు హాజరయ్యేటప్పుడు పార్టీకి చెందిన పలువురు నేతలు వారికి సంఘీభావ సూచకంగా వారితో పాటు వెళ్తారు.