జాతీయ వార్తలు

నిర్వాసితులు తరలి వెళ్లాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు సేకరించిన ప్రాంతంలో నిర్మాణాలు ప్రారంభం కాకపోవటం వల్ల భూమిని ఇచ్చిన కొంతమంది అక్కడే తాత్కాలికంగా ఉంటున్నారని కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రి జులో వోరమ్ చెప్పారు. కాంగ్రెస్ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభలో ఆయన ఈ సంగతి చెప్పారు. పని ప్రారంభమైన తరువాత వీరు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయక తప్పదని మంత్రి చెప్పారు. ఈ భూమికి ఇవ్వవలసిన నష్టపరిహారం చెల్లించటంతోపాటు పునరావాసం కల్పించటానికి కూడా తగిన చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. అవార్డు పూర్తి అయినందున నిర్వాసితులకు ప్రత్యామ్నాయం లేదని ఆయన పాల్వాయికి చెప్పారు. పవర్ హౌస్ నిర్మాణం కోసం సేకరించిన భూమికి కూడా నష్ట పరిహారం చెల్లించి నిర్వాసితులకు పునరావాసం కల్పించటం జరిగిందని ఆయన చెప్పారు. పోలవరం నిర్మాణానికి తాను వ్యతిరేకి కాదని పాల్వాయి తెలియచేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూమిని సేకరించటం వల్ల నిర్వాసితులైన వారికి పునరావాసం, నష్ట పరిహారం చెల్లింపులో న్యాయం జరగాలన్నదే తన అభిమతమని పాల్వాయి తెలియచేశారు.

చాయ్‌పె చర్చే తప్ప తేయాకు
కార్మికుల ఇబ్బంది పట్టదా?
మోదీపై రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ‘చాయ్‌పె చర్చ..’అంటూ నిరంతరం మాట్లాడే ప్రధాని నరేంద్ర మోదీకి తేయాకు కార్మికుల కడగళ్లు పట్టడం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలో తేయాకు కార్మికులు పేదరికంలో మగ్గుతున్నా..వారి గురించి ఆలోచించే, పట్టించుకునే తీరికే ప్రధానికి లేకుండా పోయిందని అన్నారు. బుధవారం జంతర్‌మంతర్‌లో జరిగిన పశ్చిమ బెంగాల్ తేయాకు కార్మికుల నిరసన కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. బులెట్ రైళ్ల గురించి మాట్లాడేందుకు ఉత్సాహంగా ముందుకొచ్చే ప్రధాని మోదీకి తాను తాగే తేనీరుకు అవసరమైన తేయాకు కార్మికులను విస్మరిస్తున్నారని అన్నారు. ‘అభివృద్ధి గురించి నిరంతరం మాట్లాడతారు. దేశాన్ని మార్చేస్తామని చెబుతారు. బులెట్ రైళ్ల గురించీ నిరంతరం ప్రస్తావిస్తారు. కానీ దేశం కోసం చెమటోడుస్తున్న వారి గురించి మాత్రం పట్టించుకోరు’అని ప్రధాని మోదీపై రాహుల్ విరుచుకు పడ్డారు.