జాతీయ వార్తలు

దళిత మహిళలపై దాడులు చేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: మధ్యప్రదేశ్‌లో దళిత మహిళలపై దాడి అంశం బుధవారం రాజ్యసభలో గందరగోళానికి దారి తీసింది. దళితుల అంశంపై చర్చ సందర్భంగా మధ్యప్రదేశ్‌లో గోరక్ష పేరిట ఇద్దరు ముస్లిం మహిళలపై దాడి జరిగిన సంఘటనపై బిఎస్పీ, కాంగ్రెస్ సభ్యులు గందరగోళం సృష్టించారు. బుధవారం సభలో లిస్ట్ అయిన అంశాలకు సంబంధించిన పత్రాలను సభలో ఉంచిన వెంటనే బిఎస్పీ అధినేత మాయావతి లేచి గుజరాత్‌లో దళిత యువకులను చితకబాదిన సంఘటన తర్వాత గోరక్ష గ్రూపులు మధ్యప్రదేశ్‌లో గోమాంసం తీసుకెళ్తున్నారన్న అనుమానంపై ఇద్దరు ముస్లిం మహిళలను చితకబాదారని ఆరోపించారు. గేదె మాంసాన్ని ఆవుమాంసంగా భావించి దాడి చేయడం సరికాదని విమర్శించారు. మందసౌర్ రైల్వే స్టేషన్‌లో పోలీసుల కళ్లముందే ఘటన జరిగిందని, వాళ్లు ఇదంతా చూస్తూ వౌనంగా ఉండిపోయారని కూడా ఆరోపించారు. బిజెపి ఒకవైపు ఆడపిల్లలకు రక్షణ కల్పించడం గురించి, మహిళలకు గౌరవ మర్యాదలు కల్పించడం గురించి మాట్లాడుతూ, మరోవైపు వారిపై గూండాలను ఉసిగొల్పుతోందని ఆమె ఆరోపించారు. బిజెపి కంచుకోట అయిన గుజరాత్‌లో నలుగురు దళిత యువకులను చావగొట్టిన సంఘటన జరిగిన కొద్ది రోజులకే అదే పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరగడం గమనార్హమని ఆమె చెప్పారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు పెరిగి పోతున్నాయని ఆమె అంటూ గో రక్ష పేరుతూ తమ మతం వారిపై జరిగిన దాడిపై స్పందించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీని ఆమె కోరారు. మాయావతి తన ప్రసంగాన్ని ముగించిన వెంటనే బిఎస్పీ సభ్యులు వెల్‌లోకి దూసుకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇది మహిళా వ్యతిరేక ప్రభుత్వమని, దళిత వ్యతిరేక ప్రభుత్వమని అంటూ వారు నినాదాలు చేశారు.కాంగ్రెస్ సభ్యులు కూడా వారితో కలిశారు. ‘గో రక్ష’ పేరుతో దళితులపై జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ ప్రశ్నించారు. ‘చాయ్‌పే చర్చ, మన్‌కీ బాత్ జరిపిన ప్రధాని ఈ అంశంపై ఎందుకు మాట్లాడరు? అని ఆయన ప్రశ్నించారు. జీరో అవర్‌లో మాట్లాడడానికి 13 మంది సభ్యులు నోటీసులు ఇచ్చారని, దీన్ని జరక్కుండా చూడడం మంచిది కాదని డిప్యూటీ చైర్మన్ పిజె కురియన్ అంటూ దీనిపై చర్చ జరగాలని కోరుకుంటూ ఉంటే నోటీసు ఇవ్వాలని గొడవ చేస్తున్న సభ్యులకు సూచించారు. ‘మీరు మీ సీట్లలోకి వెళ్లండి.. దీనిపై స్పందించమని ప్రభుత్వాన్ని కోరుతాను’ అని ఆయన అంటూ, మీ పార్టీ సభ్యులను వెనక్కి పిలవాలని మాయావతిని, ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్‌ను కోరారు. కాగా, కాంగ్రెస్ పార్టీ గోరక్షణకు వ్యతిరేకం కాదని, అయితే గోరక్ష పేరుతో దళితులు, ముస్లింలపై దాడులు చేయడానికి వ్యతిరేకమని ఆజాద్ చెప్పారు.
chitram...
రాజ్యసభలో...