జాతీయ వార్తలు

‘హోదా’ బిల్లుపై నేడు రాజ్యసభలో చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు తీరు, విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలుపై గురువారం రెండు గంటలకు రాజ్యసభలో చర్చ జరగనుంది. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ సభ్యుడు కెవిపీ రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రైవేటు బిల్లు విషయంలో ఓటింగ్‌పై సోమ, మంగళవారాలలో కాంగ్రెస్ రాజ్యసభను స్తంభింపజేయడం తెలిసిందే. దీంతో ఉపరాష్టప్రతి హామీద్ అన్సారీ రాజ్యసభలోని అన్ని పార్టీల సభాపక్ష నేతలతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు తీరుపై గురువారం స్వల్పకాలిక చర్చ చేపట్టడానికి అంగీకరించాయి. ఆయితే కెవిపీ రామచంద్రరావు బిల్లును ఉపసంహరించుకోవాలని చైర్మన్, ప్రభుత్వం, కాంగ్రెస్‌ను కోరారు. కెవిపీ మాత్రం బిల్లును ఉపసంహరించుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. చర్చ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇస్తారు. ప్రత్యేక హోదాపై మంగళవారం కాంగ్రెస్ ఓటింగ్‌కు పట్టుబడినప్పుడు రెండేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వం ఏపీకి ఏ మేరకు నిధులు ఇచ్చింది అన్నదానిపై చర్చ జరగాల్సిదేనంటూ టీడీపీ నేత సుజనా చౌదరి డిమాండ్ చేశారు. రాజ్యసభ చైర్మన్ ఏర్పాటు చేసిన సమావేశానికి బీజేపీ నుండి అరుణ్ జైట్లీ, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కాంగ్రెస్ నుండి గులామ్ నబీ ఆజాద్, అనంద్ శర్మ, టీడీపీ నుండి సుజనా చౌదరి, సీఏం రమేశ్, సీపీఐ నుండి సీతారాం ఏచూరి హజరయ్యారు.
తెలంగాణ ప్రభుత్వానికి
హెచ్‌ఆర్‌సి నోటీసులు
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, జూలై 27: గాంధీ ఆసుపత్రిలో జూలై 22న విద్యుత్ సరఫరా ఆగిపోవడం వల్ల 21 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటిసులు జారీచేసింది. వార్తా కథనాలను అధారంగా చేసుకుని సుమోటోగా కేసును స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్సీ ఆరోగ్య శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శికి నోటీసులు జారీచేస్తూ ఆరు వారాల్లోగా సమాధానమివ్వాలని ఆదేశించింది. బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు తీసుకొన్న చర్యలేమిటో వివరించాలని కోరింది. ఆసుపత్రులు, సున్నిత ప్రాంతాల్లో క్రమం తప్పకుండా డ్రిల్ నిర్వహించాలని, విద్యుత్ సమస్యలు తలెత్తినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించింది.