జాతీయ వార్తలు

టిఆర్‌ఎస్ అక్రమాలు అన్నీ ఇన్నీ కావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: తెలంగాణ లో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల నుండి వి ధానమండలికి జరుగుతున్న ఎన్నిక ల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యు డు గుత్తా సుఖేందర్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశా రు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి డాక్టర్ నసీం, జయిదీకి సుఖేందర్‌రెడ్డి బుధవారం ఈ మేరకు లేఖ రాశారు. ఇతర పార్టీలకు చెందిన ఓటర్లను టిఆర్‌ఎస్ భయపెడుతోంది, బెదిరిస్తోంది, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయటం ద్వారా వారిపై వత్తిడి తెస్తోందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో టిఆర్‌ఎస్ నాయకులు ఓటర్లను భయపెడుతూ రా జ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల నుండి మొత్తం ఓటర్ల సంఖ్య 1104 కాగా ఇందులో కాంగ్రెస్ ఓటర్ల సంఖ్య 547, మిత్ర పక్షమైన సిపిఐ కు 28 మంది ఓటర్లు ఉన్నారనీ, టిఆర్‌ఎస్ ఓటర్ల సంఖ్య కేవలం 138 మాత్రమేనని సుఖేందర్‌రెడ్డి వివరించారు. కేవలం 138 మంది ఓటర్లున్న టిఆర్‌ఎస్ నల్గొండలో అభ్యర్థిని రంగంలోకి దించి ఇతర పార్టీలకు చెందిన ఓటర్లపై వత్తిడి తెస్తోంని సుఖేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. టిఆర్‌ఎస్ నాయకులు జిల్లాలోక్యాంపులు ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఆయన ఆరోపించారు. నేర చరిత్ర ఉన్న నాయకులతోపాటు శాసన సభ్యులను కూడా వారి ఇళ్లకు పరిమితం చేయాలని, కేంద్ర బలగాలను మోహరించి క్యాంపుల నిర్వహణను అరికట్టాలని సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల రోజు ఓటర్లకు ఇచ్చే బ్యాలెట్ పత్రం దుర్వినియోగం కాకుండా చూడాలని ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి విజప్తి చేశారు.