జాతీయ వార్తలు

బ్రిటన్‌తో బంధం బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ లండన్, జూలై 27: భారత్, బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని, ఇరు దేశాలు మరింత సన్నిహితం కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వాణిజ్యం, రక్షణ రంగాలుసహా వివిధ రంగాలలో ఇరు దేశాల మధ్య సంబంధాలు పటిష్ఠం కావాలని ఆయన బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి థెరిసా మేకు సూచించారు. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన థెరిసాకు మోదీ మంగళవారం ఫోన్ చేసి, అభినందనలు తెలిపారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి బుధవారం ఢిల్లీలో చెప్పారు.
వివిధ ప్రపంచ వేదికలపై భారత్‌కు స్థిరమైన మద్దతును కొనసాగిస్తున్న బ్రిటన్‌ను ఈ సందర్భంగా మోదీ అభినందించారు. తనను అభినందించిన మోదీకి థెరిసా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పటిష్ఠం చేయడానికి, ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి మోదీతో సన్నిహితంగా కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. నిరుడు నవంబర్‌లో చేసిన తన చిరస్మరణీయ బ్రిటన్ పర్యటనను ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు. ఈ ఇద్దరు నేతల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణలో వాణిజ్యం, పెట్టుబడుల అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయని బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబధాలు భవిష్యత్తులో మరింత బలపడాలని మోదీ ఈ సందర్భంగా కోరినట్లు వివరించింది. ఇరు దేశాల మధ్య సన్నిహిత, వృద్ధి చెందుతున్న ఆర్థిక సహకారానికి వచ్చే నెలలో లండన్‌లో తొలిసారి ప్రారంభించనున్న రూపీ-డినామినేటెడ్ బాండ్ నిదర్శనమని బ్రిటన్ ప్రధాని థెరిసా పేర్కొన్నారు. సృజనాత్మక ఫైనాన్స్‌కు లండన్ నగరం ప్రపంచ కేంద్రంగా కొనసాగుతుందని ఆమె అన్నారు. యూరోపియన్ యూనియన్ (ఇయు) నుంచి బ్రిటన్ వైదొలగాలని గత నెల 23న నిర్వహించిన రెఫరెండంలో ప్రజలు తీర్పు ఇచ్చిన తరువాత డేవిడ్ కామెరాన్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడంతో థెరిసా మే ఆ పదవిని చేపట్టారు.