జాతీయ వార్తలు

అది ప్రైవేటు వ్యవహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: ప్రైవేట్ పరువునష్టం ఫిర్యాదును విచారించాలని మెజిస్ట్రేట్‌లు పోలీసులను ఆదేశించలేరని సుప్రీం కోర్టు బుధవారం స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై దాఖలైన ప్రైవేట్ క్రిమినల్ పరువునష్టం కేసులో సుప్రీం కోర్టు విచారణ జరిపింది. మహాత్మాగాంధీని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హత్య చేసిందంటూ చేసిన వ్యాఖ్యలపై ఆరెస్సెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలన్న రాహుల్ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, ఆర్ ఎఫ్ నారిమన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రాహుల్ గాంధీ దోషారోపణ చేసిన సంస్థ పట్ల విచారం వ్యక్తం చేయకపోవటం వల్ల విచారణ ఎదుర్కోవలసి వస్తుందని ధర్మాసనం పేర్కొంది. అయితే రాహుల్ గాంధీపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయాల్సిందిగా మహారాష్ట్ర పోలీసులను స్థానిక కోర్టు ఆదేశించటాన్ని తప్పుపట్టింది. క్రిమినల్ ఫిర్యాదులో పోలీసుల పాత్ర ఏమీ లేదు. ఇది ఫిర్యాదుదారే నిరూపించాల్సి ఉంటుంది. పోలీసులను నివేదిక ఇవ్వాలని మెజిస్ట్రేట్‌లు కోరలేరని వ్యాఖ్యానించింది.
ఢిల్లీలో 12నుంచి ‘్భరత్ పర్వ్’
న్యూఢిల్లీ, జూలై 27: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ‘్భరత్ పర్వ్’ పేరిట ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. ఆగస్టు 12నుంచి ఆరు రోజుల పాటు ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండేళ్లయిన సందర్భంగా సుమారు రెండున్నర నెలల క్రితం ఇండియా గేట్ వద్ద వేడుకలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘్భరత్ పర్వ్’ను రాజ్‌పథ్‌లో నిర్వహించనున్నది. ప్రజలలో దేశభక్తి స్ఫూర్తిని నింపేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు వంద స్టాళ్లను ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేస్తారు. వివిధ రాష్ట్రాలకు చెందిన స్థానిక కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
మల్లన్నసాగర్‌పై
విపక్షాల కుట్రలు
ఎంపీ బూర
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ,జూలై 27: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని టిఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆరోపించారు. బుధవారం నర్సయ్యగౌడ్ విలేఖరులతో మాట్లాడుతూ కేవలం అధికారదాహంతో కాంగ్రెస్, టిడిపిలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో ఎపిలో వేల ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుంటున్న టిడిపి తెలంగాణలో నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎంపీ విమర్శించారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుకార్చడానికి అన్ని ప్రయాత్నాలు చేసిన టిడిపి ఇప్పుడు రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకుంటోందని ఆయన ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ముంపు ప్రాంతాలు లేకుండా ఏ ప్రాజెక్టును నిర్మించలేమని, అలా నిర్మించిన ప్రాజెక్టులు దేశంలో ఏమైనా ఉన్నయా అని ప్రశ్నించారు.
సిరియాలో పేలుళ్లు
44 మంది మృతి
డమాస్కస్, జూలై 27: సిరియాలో రెండు పేలుడు సంఘటనల్లో 44 మంది మరణించారు. కుర్దిష్‌లు ఎక్కువగా ఉండే ఉత్తర సిరియాలో జరిగిన ఈ పేలుళ్లకు తామే బాధ్యులని ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. కయామిష్లి పట్టణంలో మొదటగా ఒక ట్రక్కు బాంబు పేలిందని, ఆ తర్వాత మోటారు సైకిల్‌పై వచ్చిన వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. టర్కీ సరిహద్దున ఉండే పట్టణంలో కుర్దిష్‌ల ఆధిపత్యం కొనసాగుతోంది. పేలుడు జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని సిరియా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి.

నేపాల్‌లో వరదలు
54 మంది మృతి
ఖాట్మండు, జూలై 27: నేపాల్‌లో వరదలు, మట్టిపెళ్లలు విరిగిపడిన సంఘటనల్లో దాదాపు 54 మంది మృతిచెందారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దేశంలోని 14 జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఒక్క ఫైతాన్ జిల్లాలోనే 26 మంది మృతిచెందారు. గత ఏడాది సంభవించిన పెను భూకంపంలో 9వేల మంది మరణించగా, ఇంకా వేలాది మంది గుడారాల్లో నివసిస్తున్నారు. ప్రస్తుత వరదల వల్ల వారి పరిస్థితి మరింత దుర్భరంగా తయారైంది. సప్తకోషి, నారాయణి నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. నారాయణి నదిపై ఉన్న గండక్ బ్యారేజీ గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయడంతోపాటు సైనికులను, వాలంటీర్లను ప్రభుత్వం రంగంలోకి దించింది. వరద ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహార సామగ్రిని బాధితులకు అందజేస్తున్నారు.